కింద పడటం వల్ల గాయాలయ్యాయని డాక్టర్‌తో అబద్ధం చెప్పిన 84 ఏళ్ల వృద్ధురాలు.. కానీ అసలు నిజమేంటంటే..

ABN , First Publish Date - 2022-04-12T18:24:03+05:30 IST

84ఏళ్ల వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఏమైందమ్మా అని అడిగితే.. కింద పడడంతో దెబ్బలు తగిలాయని చెప్పింది. అయితే చివరకు అసలు విషయం తెలుసుకుని ...

కింద పడటం వల్ల గాయాలయ్యాయని డాక్టర్‌తో అబద్ధం చెప్పిన 84 ఏళ్ల వృద్ధురాలు.. కానీ అసలు నిజమేంటంటే..
ప్రతీకాత్మక చిత్రం

తల్లిని ప్రేమగా చూసుకునే కొడుకులు ఉన్నారో లేరో తెలీదు గానీ.. కొడుకును ప్రేమగా చూసుకోని తల్లి అంటూ ఉండదు. కంటికి రెప్పలా కాపాడుకుని.. పెంచి పెద్దవాళ్లను చేస్తుంది. పెద్దయ్యాక తనను చూసుకున్నా, చూసుకోకున్నా.. తల్లి ప్రేమ మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. కేరళలో తాజాగా జరిగిన ఘటన ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది.  84ఏళ్ల వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఏమైందమ్మా అని అడిగితే.. కింద పడడంతో దెబ్బలు తగిలాయని చెప్పింది. అయితే చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. అయ్యో పాపం అంటూ వృద్ధురాలిపై జాలి చూపిస్తున్నారు.


కేరళ రాష్ట్రం కొల్లాంలో ఒమన (80) అనే వృద్ధురాలు తన ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటోంది. ఈ వయసులోనూ ఆమె పనికి వెళ్లి, డబ్బు తెచ్చి కొడుకులకు ఇస్తూ ఉంటుంది. అయితే ఇద్దరు కొడుకుల్లో ఒమనకుట్టన్ అనే వ్యక్తి మాత్రం తల్లి పట్ల దురుసుగా ప్రవర్తించేవాడు. చీటికీమాటికీ ఆమెపై దాడి చేసేవాడు. ఇటీవల ఓ రోజు వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయాలు ఎలా తగిలాయని డాక్టర్లు ఆమెను ప్రశ్నించడంతో కిందపడ్డానని అబద్ధం చెప్పింది. వారు కూడా అదే నిజమనుకుని చికిత్స చేసి పంపించారు. అయితే వృద్ధురాలిపై కొడుకు దాడి చేస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది.

యూట్యూబ్‌లో డాక్టర్ చూస్తున్న వీడియోలేంటో తెలిసి నివ్వెరపోయిన పేషెంట్.. మొబైల్‌లో రికార్డ్ చేసి..


వీడియో ఆధారంగా ఆదివారం ఒమనకుట్టన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వృద్ధురాలు మాత్రం తన కొడుకుపై ఫిర్యాదు చేసేందుకు నిరాకరించింది. దీంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంతగా చిత్రహింసలు పెడుతున్నా, తల్లి మాత్రం కొడుకుపై ప్రేమ చూపించడం.. అందరినీ కంటతడి పెట్టించింది. గ్రామ కౌన్సిలర్ ప్రదీప్ మాట్లాడుతూ వృద్ధురాలిపై కొడుకు గతంలోనూ చాలా సార్లు దాడి చేశారని చెప్పాడు. తనకు సాయం చేద్దామని చూసినా.. ఆమె నిరాకరించిందని గుర్తు చేశాడు. ఒమనకుట్టన్‌పై తల్లి ఫిర్యాదు చేయకున్నా.. అతడిపై కేసులు నమోదు చేయడానికి గత మార్గాలపై పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

డబ్బుల్లేక ఇంటర్‌తోనే చదువుకు పులుస్టాప్.. ఇప్పుడు ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఈ కుర్రాడు చేసే పనేంటంటే..

Updated Date - 2022-04-12T18:24:03+05:30 IST