Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 18 May 2022 07:56:54 IST

‘‘నా భార్యకు చీర కట్టుకోవడం రాదు.. కనీసం సరిగా నడవడం కూడా చేతకాదు’’.. అంటూ చివరకు ఆ వ్యక్తి చేసిన పని..

twitter-iconwatsapp-iconfb-icon
నా భార్యకు చీర కట్టుకోవడం రాదు.. కనీసం సరిగా నడవడం కూడా చేతకాదు.. అంటూ చివరకు ఆ వ్యక్తి చేసిన పని.. ప్రతీకాత్మక చిత్రం

తెలిసి చేస్తారో, తెలీక చేస్తారో తెలీదు గానీ... కొందరు చిన్న చిన్న సమస్యలకే హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కొందరు తనువు చాలిస్తుంటే.. మరికొందరు ఆర్థిక, ప్రేమ సంబంధిత సమస్యలతో జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. కొందరు ప్రబుద్ధులైతే తమలోని శాడిజాన్ని ఎదుటి వారి మీద చూపిస్తూ ఇబ్బందులు పెడుతుంటారు. అయితే మహారాష్ట్రలో జరిగిన ఘటన ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. నా భార్యకు చీర కట్టుకోవడం రాదు, కనీసం సరిగా నడవడం కూడా చేతకాదు.. అంటూ లేఖ రాసిన వ్యక్తి చివరకు ఏం చేశాడంటే...

మహారాష్ట్ర ఔరంగాబాద్ పరిధి ముకుంద్ నగర్‌కు చెందిన సామధాన్ సాబ్లే(24)కు ఆరు నెలల క్రితం తన కంటే ఆరేళ్లు పెద్ద వయసున్న యువతితో వివాహమైంది. అయినా వారి మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. ఇటీవల వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. తరచూ ఏదో ఒక విషయం మీద గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో సోమవారం ఉన్నట్టుండి సామధాన్.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతవరకూ బాగున్న అతను ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పెళ్లయిన మరుసటి రోజే నవ వధువు షాకింగ్ నిర్ణయం.. భర్తకు విడాకులు.. ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ..

సంఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ’’నా భార్యకు చీర కట్టుకోవడం రాదు.. కనీసం నడవడం కూడా రాదు. అలాంటి ఆమెతో కలిసి జీవించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’’.. అని రాసి ఉంది. ఈ లేఖను చూసిన వారంతా షాక్ అయ్యారు. ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అంతా చర్చించుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సామధాన్ మృతికి అదే కారణమా..? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పెళ్లైన మూడో రోజే ఇంట్లోంచి ఎస్కేప్.. మర్నాడే భార్య వీడియో కాల్ చేసి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఈ భార్యాభర్తలిద్దరూ ఐఐటీ టాపర్స్.. America లో కోట్లలో ప్యాకేజీతో జాబ్స్‌కు రాజీనామా చేసి సొంతూరికి తిరిగొచ్చి..చోరీకి గురయిన విగ్రహాలు.. మళ్లీ ఇంట్లో ప్రత్యక్ష్యం.. వాటితోపాటు దొరికిన లేఖలో ఆ దొంగ రాసింది చదివి..పొలానికి తుపాకీ తీసుకెళ్లొద్దు.. అని సూచించిన అన్న... మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి తమ్ముడు చేసిన నిర్వాకం.. కాసేపట్లో పెళ్లనగా వరుడికి మైండ్‌బ్లాక్.. వధువుకు వేరే కుర్రాడితో పెళ్లి చేసిన తండ్రి.. అసలు కథేంటంటే..కోట్లు వద్దు.. ఒక్కసారైనా కూర్చుంటే చాలంటున్న మహిళ.. ఇదేం కోరిక అని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్యేంటో తెలిస్తే..తాళి కట్టిన తర్వాత ఎంటరైన పోలీసులు... కాసేపటికి భర్త స్థానంలో మరిది ప్రత్యక్షం... జరిగిన విషయం తెలుసుకుని అవాక్కయిన బంధువులు
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.