ప్రతీకాత్మక చిత్రం
పిల్లలకు యుక్త వయసు వచ్చే క్రమంలో మనసు, శరీరంలో పలు మార్పులు సంభవిస్తుంటాయి. ఈ సమయంలో వారు ఒత్తిడి, గందరగోళం, కొన్నిసార్లు డిప్రెషన్‌కు లోనవుతుంటారు. ఇలాంటి పిల్లలు కొందరు చిన్న చిన్న కారణాలకే.. నేరాలు చేసి జీవితాన్ని నాశనం చేసుకుటుంటూ ఉంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. తమిళనాడులో 12వ తరగతి చదువుతున్న బాలుడిని తన స్నేహితుడు, అమ్మాయిలా ప్రవర్తిస్తున్నావంటూ హేళన చేసేవాడు. దీంతో ఆ బాలుడు తన స్నేహితులను అందరినీ పార్టీకి పిలిచాడు. చివరకు అతడు చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో విద్యార్థి 12వ తరగతి చదువుతున్నాడు. ఇతన్ని తన స్నేహితుడు.. అమ్మాయిలా ప్రవర్తిస్తున్నావంటూ హేళన చేసేవాడు. నన్ను అలా పిలవొద్దు.. అని అతడికి ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకునేవాడు కాదు. దీంతో స్నేహితుడిపై పగ పెంచుకున్నాడు. ఓ రోజు అతడితో పాటూ మిగతా కొంత మంది స్నేహితులను పార్టీకి పిలిచాడు. అంతా సంతోషంగా ఉండగా.. తనను అవమానించిన స్నేహితుడిని పక్కకు పిలిచాడు. అనంతరం ఒక్కసారిగా కొడవలితో దాడి చేశాడు.
ఈ దాడిలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు మైనర్ కావడంతో అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు డాక్టర్ శరణ్య జయకుమార్ స్పందించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. పిల్లల మానసిక పరిస్థితిని తల్లిదండ్రులు గమనిస్తుండాలని సూచించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి