Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 26 Jul 2022 18:27:53 IST

Shocking decision: అత్త చేసిన నిర్వాకం గురించి చెబుతూ గర్భిణి షాకింగ్ నిర్ణయం.. మెసేజ్ చూసిన చెల్లెలు కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్లగా..

twitter-iconwatsapp-iconfb-icon
Shocking decision: అత్త చేసిన నిర్వాకం గురించి చెబుతూ గర్భిణి షాకింగ్ నిర్ణయం.. మెసేజ్ చూసిన చెల్లెలు కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్లగా..ప్రతీకాత్మక చిత్రం

కొన్ని కుటుంబాల్లో కోడలిని అత్త, మరికొన్ని కుటుంబాల్లో అత్తను కోడలు వేధించడం తరచూ చూస్తేనే ఉన్నాం. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు చిన్న సమస్యలు కూడా చాలా పెద్దవి అవుతుంటాయి. చెన్నైలో ఇలాగే జరిగింది. తన అత్త చేసిన నిర్వాకం గురించి చెల్లెలికి మెసేజ్ చేసిన అక్క.. చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మెసేజ్ చూడగానే చెల్లెలు కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్లింది. చివరకు జరిగిన ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఇందుమతి అనే యువతికి ఐదు నెలల క్రితం వివాహమైంది. చాలా మంది కోడళ్ల విషయంలో జరిగినట్లే.. ఈమె విషయంలో కూడా అత్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. పెళ్లయిన కొత్తలో బాగా చూసుకున్న అత్త.. నెలలు గడిచే కొద్దీ వేధించడం మొదలెట్టింది. నువ్వు లావుగా ఉన్నావంటూ ఒకసారి.. దుస్తుల విషయంలో మరోసారి.. ఇలా ఏదో ఒక సాకుతో వేధించడం మొదలెట్టింది. చివరకు ఆహారం విషయంలో కూడా ఆంక్షలు విధించేది. ఇటీవల ఇందుమతి గర్భం దాల్చింది. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.

Boy Tortured by Villagers: 10 ఏళ్ల బాలుడిని కొడుతూ ఊరంతా తిప్పి.. చివరకు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు.. అసలేం జరిగిందంటే..

ఇన్నాళ్లు సహనంతో ఉన్న ఆమె చివరకు వేధింపుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ప్రస్తుతం ఆమె వేలచేరిలోని తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం తన చెల్లెలికి మెసేజ్ చేసింది. మా అత్త నన్ను అవమానిస్తోందంటూ జరిగిన విషయం మొత్తం తెలియజేసింది. ఈ మెసేజ్ చూసిన చెల్లెలు కంగారుగా పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్లింది. అయితే అప్పటికే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల ఆమె ఒంటరిగా ఉంటోందని, ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అనే విషయంపై సోషల్ మీడియాలో సెర్చ్ చేసేదని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Father Risk for Daughters: కూతుళ్ల కోసమే జైలు నుంచి పారిపోయాడు.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ కూతుళ్ల కోసమే లొంగిపోయిన ఓ తండ్రి కథ..!

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Shocking decision: మీ కూతురు ఎక్కడ అని అడిగితే.. గండె పోటుతో చనిపోయిందని చెప్పండి.. అని లేఖ రాసి.. 15 ఏళ్ల బాలిక చేసిన పని..Bank cash: యువతిని మాటల్లోకి దింపిన యువకుడు.. తిరిగి ఇంటికి వస్తుండగా పాస్‌బుక్ తెరచి చూసిన ఆమెకు.. woman bus driver: అంత అందగత్తె.. ఇంత గొప్ప బస్ డ్రైవర్.. మొత్తానికి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిందిగా..పచ్చ చొక్కా అంకుల్ అంటూ.. ఏడుస్తూ టీచర్ దగ్గరకు వెళ్లి జరిగిన దారుణాన్ని చెప్పిన 8 ఏళ్ల బాలిక.. చివరకు..1433 Kilometers ప్రయాణించి భర్తను చేరుకున్న మహిళ.. ఇంటి ఎదుట ఏడు రోజులుగా కేవలం నీళ్లు తాగుతూ.. చివరకు రిక్షా డ్రైవర్ గమనించడంతో..Viral Video: పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూసి.. సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా దాచిన వరుడు.. వధువు రియాక్షన్ చూస్తే..video
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.