Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధ్యానంతో మేలు...

ఆంధ్రజ్యోతి(29-10-2020)

రోజూ ధ్యానం ఎందుకు  చేయాలి? అంటే ధ్యానంతో చాలా రకాల ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.


రోజూ ధ్యానం చేయడం వల్ల ఆలోచనా స్థాయి పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో మరింత సమర్ధంగా పనిచేస్తారు. అవగాహన శక్తి పెరుగుతుంది.


ధ్యానం తాలూకు ఫలితాలు మీ ఆలోచనల్లో కనిపిస్తాయి. మీ మనస్సు గడిచిన కాలంపైకి, భవిష్యత్తుపైకి వెళ్లకుండా ప్రస్తుత కాలంపై దృష్టి నిలుపుతుంది. దానివల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.


 మీలోని అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది. ఎక్కువ ఒత్తిడి అనారోగ్యాన్ని  తెచ్చిపెడుతుంది. దీన్ని ఎదుర్కోవాలంటే ధ్యానం తప్పనిసరి. 


భావోద్వేగాలపై నియంత్రణ వస్తుంది. సంతోషాన్ని అందరూ వ్యక్తపరుస్తారు. కోపం, బాధ, విషాదం వంటి భావోద్వేగాలను వ్యక్తపరిచే సమయంలోనూ నియంత్రణ ఉండాలంటే ధ్యానంతోనే సాధ్యమవుతుంది. 


 మంచి నిర్ణయాలు తీసుకునే  సామర్థ్యం వస్తుంది. నిర్ణయం తీసుకునే ముందు దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించే  శక్తి, విశ్లేషించుకునే సామర్థ్యం పెరుగుతాయి.


ధ్యానం ద్వారా కొత్త నైపుణ్యాలు పెంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఽఇతర నైపుణ్యాల మాదిరిగానే ధ్యానం ఒక నైపుణ్యమే. ప్రాక్టీస్‌, ఏకాగ్రతతో ఇది పెరుగుతుంది. దీని ద్వారా జీవితంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది.


దీర్ఘకాలం పాటు ధ్యానం చేసినపుడు రోగనిరోధక శక్తి బలోపేతమయి ఆరోగ్యవంతమైన జీవితం గడిపే అవకాశం లభిస్తుంది.  


Advertisement
Advertisement