ఈ దొంగల ముఠా స్టైలే వేరు.. వీటిని కూడా చోరీ చేస్తారా.. అని అంతా అవాక్కయ్యేలా..!

ABN , First Publish Date - 2022-04-09T13:34:47+05:30 IST

ఒక్కోసారి దొంగల అతి తెలివి చూస్తే నవ్వు తెప్పిస్తుంది.. కొన్నిసార్లు వారి చేతివాటం చూస్తే, ఆశ్చర్యం కలుగుతుంది. పెద్ద పెద్ద చోరీలను సైతం సునాయాసంగా చేస్తుంటారు. అప్పుడప్పుడూ..

ఈ దొంగల ముఠా స్టైలే వేరు.. వీటిని కూడా చోరీ చేస్తారా.. అని అంతా అవాక్కయ్యేలా..!

ఒక్కోసారి దొంగల అతి తెలివి చూస్తే నవ్వు తెప్పిస్తుంది.. కొన్నిసార్లు వారి చేతివాటం చూస్తే, ఆశ్చర్యం కలుగుతుంది. పెద్ద పెద్ద చోరీలను సైతం సునాయాసంగా చేస్తుంటారు. అప్పుడప్పుడూ రద్దీ ప్రాంతాల్లో సైతం గుట్టు చప్పుడు కాకుండా చోరీలు జరగడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. నెదర్లాండ్స్‌లో ఓ దొంగల ముఠా చేసిన చోరీ.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  డెయిరీ ఫామ్‌లోకి చొరబడిన దొంగలు... ఏకంగా రూ.17లక్షల విలువైన చీజ్‌(జున్ను) ని ఎత్తుకెళ్లారు.


నెదర్లాండ్స్‌  దక్షిణ ప్రాంతంలోని ఫిజ్‌నార్ట్ పట్టణంలో  డెయిరీ ఫామ్‌లో బుధవారం.. దొంగల ముఠా $23,000 (సుమారు రూ.17 లక్షలు) విలువైన 1,600 కిలోల చీజ్‌ని అపహరించింది. ఈ చీజ్ తయారు కావడానికి ఎన్నో నెలల సమయం పడుతుందని, ఈ చోరీతో ఆరు నెలల ఆదాయాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు చీజ్‌ని ఎత్తుకెళ్లినా.. విక్రయించడానికి వీలు ఉండదని  స్థానిక బ్రాడ్‌కాస్టర్ ఓమ్రోప్ బ్రబంట్‌, పాడి రైతుల సంస్థ ఛైర్మన్ థియో డెక్కర్ తెలిపారు. నెదర్లాండ్స్‌లో జున్నును విక్రయించాలంటే ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ కోడ్ ఉండాలన్నారు. అది లేని పక్షంలో విక్రయించడం వీలవదని చెప్పారు. నెదర్లాండ్స్‌లో గతంలో ఇలాంటి చోరీలు చాలా జరిగాయని తెలిపారు.

పాయసం తిన్న పిల్లలు కాసేపటికే ఆస్పత్రిలో చేరిక.. చివరగా తల్లి చేసిన పని తెలుసుకుని అంతా షాక్..


ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే నెదర్లాండ్స్‌లో 9.7 శాతం చోరీలు పెరిగాయన్నారు. దొంగలు చీజ్‌లను బస్సులో నింపుకొని వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించామని, ప్రతి ఒక్కరూ తమ డెయిరీ ఫామ్‌ల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. అలాగే బీమా చేయించుకోవడం వల్ల ఇలాంటి చోరీలు జరిగినప్పుడు నష్ట పరిహారం అందుతుందని పేర్కొన్నారు.  

వీళ్లేం దంపతులు బాబోయ్.. ఏకంగా 60 కేసులు పెట్టుకున్నారు.. సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..

Updated Date - 2022-04-09T13:34:47+05:30 IST