Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 18 Sep 2022 20:55:31 IST

అక్కా! నీతో మాట్లాడాలి.. అంటూ కారులో ఊరి బయటకు తీసుకెళ్లాడు.. తన మాటకు అభ్యంతరం చెప్పడంతో చివరకు..

twitter-iconwatsapp-iconfb-icon
అక్కా! నీతో మాట్లాడాలి.. అంటూ కారులో ఊరి బయటకు తీసుకెళ్లాడు.. తన మాటకు అభ్యంతరం చెప్పడంతో చివరకు.. ప్రతీకాత్మక చిత్రం

భర్త, అత్తమామల నుంచి సమస్యలు ఎదురైన సమయంలో.. పుట్టింటి వారు ఉన్నారనే ధైర్యంతో ఉంటారు. అత్తింట్లో చిత్రహింసలు మరీ ఎక్కువైన సమయంలో చివరకు తల్లిదండ్రులు, అన్నాతమ్ముళ్ల ఎదుట తన బాధను వెళ్లబోసుకుంటారు. అలాగే పుట్టింటి వారు కూడా తమ కూతురు సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంటారు. అయితే కర్నాటకలో మాత్రం ఓ మహిళ విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. తమ్ముడే కదా అని నమ్మినందుకు తన ప్రాణాలనే పోగొట్టుకోవాల్సి వచ్చింది. అక్కా! నీతో మాట్లాడాలంటూ ఊరి బయటకు తీసుకెళ్లి.. తన మాట వినలేదని దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కర్నాటక (Karnataka) చిక్కనాయకనహళ్లి ప్రాంతానికి చెందిన సుధ అనే మహిళ కానిస్టేబుల్‌గా (woman constable) విధులు నిర్వర్తిస్తోంది. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సుధ భర్త రెండేళ్ల క్రితం చనిపోవడంతో ప్రస్తుతం పిల్లలతో కలిసి  హులియూరు అనే ప్రాంతంలో ఉంటోంది. ఇదిలావుండగా, సుధకు తోడుగా ఉండేందుకు ఇటీవల తమ్ముడు మంజునాథ్ కూడా వచ్చాడు. తమ్ముడు తోడుగా ఉండడంతో సంతోషంగా ఉండేది. అయితే మంజునాథ్ మాత్రం.. అక్క ఆస్తిపై కన్నేశాడు. ఎలాగైనా ఆస్తి కొట్టేయాలని రోజూ ఆలోచిస్తూ ఉండేవాడు. అడిగితే ఒప్పుకోదనే ఉద్దేశంతో చివరికి అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

నా కూతుర్ని ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడిన స్క్రీన్ ప్లే..

ఇటీవల ఓ రోజు.. మాట్లాడాలంటూ అక్కను కారులో ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆస్తి తన పేరు మీద రాయించాలని డిమాండ్ చేశాడు. అయితే ఇందుకు సుధ ఒప్పుకోలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. చివరకు ఆగ్రహంతో ఊగిపోయిన మంజునాథ్.. అక్క అని చూడకుండా నిర్ధాక్షిణ్యంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత మంజునాథ్ భయంతో శివమొగ్గకు పారిపోయి... లాడ్జిలో దాక్కున్నాడు. చివరకు ఆందోళన ఎక్కువై.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎవరికీ అనుమానం రాకుండా.. భార్య మృతదేహంతో 500 కిలోమీటర్ల రైలు ప్రయాణం.. చివరగా పక్కనున్న వారు గమనించడంతో..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

స్నేహితులు స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువతి.. అన్నింటినీ కలిపి ప్రియుడికి పంపడంతో.. చివరకు.. షేవింగ్ పూర్తిగా చేశాక డబ్బులు ఇస్తానన్న కస్టమర్.. లేదు ఇప్పుడే ఇవ్వాలన్న బార్బర్.. చివరకు పని మధ్యలో ఆపేసి.. భార్యకు పిల్లలు పుట్టలేదనే కారణంతో ఎదురింటి మహిళను చంపిన భర్త.. అందుకే ఇలా చేశానంటూ ఆ వ్యక్తి చెప్పింది విని.. యువతిని కొట్టి, దుస్తులు ఊడదీసి మరీ వీడియో తీసిన యువకులు.. చివరకు జేసీబీలతో వెళ్లిన అధికారులు.. కుక్కను దూరంగా తీసుకెళ్లమన్న భార్య.. పట్టించుకోని భర్త, కుటుంబ సభ్యులు.. దీంతో చివరకు కూతురితో కలిసి.. పొరపాటున ఖాతాలోకి రూ.11 వేల కోట్లు.. కొద్ది గంటల్లోనే మాయం.. కానీ అతడు తెలివిగా చేసిన ఒక్క పనితో రూ.5 లక్షల లాభం..!
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.