ఎవరికీ అనుమానం రాకుండా.. భార్య మృతదేహంతో 500 కిలోమీటర్ల రైలు ప్రయాణం.. చివరగా పక్కనున్న వారు గమనించడంతో..

ABN , First Publish Date - 2022-09-18T22:23:13+05:30 IST

రైలు బోగీలో మహిళ మృతదేహం బయటపడడంతో కలకలం చెలరేగింది. చివరకు తోటి ప్రయాణికులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రైలును..

ఎవరికీ అనుమానం రాకుండా.. భార్య మృతదేహంతో 500 కిలోమీటర్ల రైలు ప్రయాణం.. చివరగా పక్కనున్న వారు గమనించడంతో..

రైలు బోగీలో మహిళ మృతదేహం బయటపడడంతో కలకలం చెలరేగింది. చివరకు తోటి ప్రయాణికులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రైలును ఆపి, బోగీలో తనిఖీ చేశారు. విచారణలో, ఓ వ్యక్తి తన భార్య మృతదేహంతో సుమారు 500కిలోమీటర్ల మేర ప్రయాణం చేసినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి తోటి ప్రయాణికులంతా షాక్ అయ్యారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


పంజాబ్‌లోని (Punjab) లూథియానా నుంచి బీహార్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నవీన్ కుమార్ అనే వ్యక్తి తన భార్య ఊర్మిళతో కలిసి ఔరంగబాద్ వెళ్లేందుకు లూథియానా నుంచి బీహార్ వెళ్తున్న రైలు (train) ఎక్కాడు. అయితే మార్గ మధ్యలో ఊర్మిళకు గుండెపోటు (heart attack) వచ్చింది. ఏం చేయాలో తెలీక భర్త కంగారుపడుతుండగానే ఆమె మృతి చెందింది. అయితే ఈ విషయం ఎవరికీ తెలీకుండా దాచిపెట్టాడు. భార్య మృతదేహంతో సుమారు 500కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. అయితే మార్గమధ్యలో ప్రయాణికులకు అనుమానం వచ్చింది.

షేవింగ్ పూర్తిగా చేశాక డబ్బులు ఇస్తానన్న కస్టమర్.. లేదు ఇప్పుడే ఇవ్వాలన్న బార్బర్.. చివరకు పని మధ్యలో ఆపేసి..


వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు (Police Control Room) సమాచారం అందించారు. షాజహాన్‌పూర్ రైల్వే పోలీసులతో కలిసి రైలును ఆపి బోగీలో పరిశీలించారు. మహిళ రోజుల క్రితం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్తను అదుపులోకి తీసుకున్నారు. నిజంగానే గుండెపోటుతో మృతి చెందిందా.. లేదా మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

స్నేహితులు స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువతి.. అన్నింటినీ కలిపి ప్రియుడికి పంపడంతో.. చివరకు..



Updated Date - 2022-09-18T22:23:13+05:30 IST