ఫార్ములా వన్ వెహికల్‌లో దూసుకెళ్తున్న యువకుడు.. ఆ వాహనంతో ఇతడు చేస్తున్న వ్యాపారం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..

ABN , First Publish Date - 2022-04-30T19:06:58+05:30 IST

తాము ఒకటి తలిస్తే.. దైవం ఇంకొకటి తలచినట్లు.. ఒక్కోసారి జీవితంలో మనం అనుకున్నదానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కొందరు...

ఫార్ములా వన్ వెహికల్‌లో దూసుకెళ్తున్న యువకుడు..  ఆ వాహనంతో ఇతడు చేస్తున్న వ్యాపారం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..

తాము ఒకటి తలిస్తే.. దైవం ఇంకొకటి తలచినట్లు.. ఒక్కోసారి జీవితంలో మనం అనుకున్నదానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కొందరు బాధ్యతల కారణంగా తమ ఆశయాలు పక్కన పెట్టి.. ఇష్టం లేని పనులు చేసుకుంటుంటారు. ఇంకొందరు మాత్రం.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాము అనుకున్నది సాధించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం చాలా ప్రత్యేకం. తను చేస్తున్న పనిలోనే తన జీవిత ఆశయాన్ని కూడా నెరవేర్చుకుంటున్నాడు.


ముంబైకి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై F1(ఫార్ములా వన్) వెహికల్‌లో ఓ వ్యక్తి దూసుకెళ్తూ ఉంటాడు. అయితే తీక్షణంగా చూస్తే.. ఆ వాహనం చూడ్డానికి F1 వెహికల్ తరహాలోనే ఉన్నా.. ప్రత్యేకంగా తయారు చేసినట్లుగా ఉంటుంది. ఎఫ్1 డ్రైవర్ డ్రైవర్ కావాలనుకున్న అతడి ఆశయం ఓ వైపు, పాల వ్యాపారం చేయమని కుటుంబ సభ్యుల ఒత్తిడి మరోవైపు.. ఎటూ తేల్చుకోలేక చివరకు రెండింటినీ నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడేమో.. తెలీదు గానీ తానే స్వయంగా F1 వెహికల్ తరహాలోనే ఓ వాహనాన్ని తయారు చేశాడు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు అందులోనే పాల వ్యాపారం కూడా చేస్తున్నాడు.

సివిల్ ఇంజనీర్‌ జాబ్‌కు గుడ్‌బై.. ఇప్పుడు రోజుకు 6 వేల సంపాదన.. ఇంతకీ ఇతడు చేస్తున్న పనేంటంటే..


ప్రతిభగల వారిని గుర్తించి, వారికి చేదోడువాదోడుగా నిలవడంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ముందుంటారన్న విషయం తెలిసిందే. ‘‘రోడ్స్ ఆఫ్ ముంబయి’’ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోను.. ఆనంద్ మహీంద్ర తన ఖాతా ద్వారా షేర్ చేశాడు. ‘‘ఈ వాహనం రోడ్డు నిబంధనలకు అనుగుణంగా తయారు చేయబడిందో లేదో నాకు తెలీదు. కానీ వాహనాల పట్ల యువకుడి ఆసక్తి.. నిబంధనలకు మించి ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని కలవాలి అనుకుంటున్నా’’ అని క్యాప్షన్ ఇస్తూ వీడియోను పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

కదులుతున్న రైలు నుంచి ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు యువతులు జంప్.. గమనించిన హోంగార్డు వెంటనే కిందకు దిగి..





Updated Date - 2022-04-30T19:06:58+05:30 IST