Sleep Experiment: నిద్రపోకుండా 30 రోజులు ఉండగలరా..? ఐదుగురు ఖైదీలపై శాస్త్రవేత్తల రహస్య ప్రయోగం.. 69 ఏళ్ల తర్వాత బయటపడిన దారుణం..

ABN , First Publish Date - 2022-10-12T00:35:25+05:30 IST

రెండో ప్రపంచ యుద్ధం (Second World War) జరుగుతున్న సమయంలో.. అంటే 1940లలో ఈ వినూత్న ప్రయోగం జరిగింది. ఆ సమయంలో రష్యా.. పలు శత్రు దేశాలను ఓడించి.. అక్కడి..

Sleep Experiment: నిద్రపోకుండా 30 రోజులు ఉండగలరా..? ఐదుగురు ఖైదీలపై శాస్త్రవేత్తల రహస్య ప్రయోగం.. 69 ఏళ్ల తర్వాత బయటపడిన దారుణం..

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ వివిధ అంశాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త రకం వ్యాధులు బయటపడిన సమయంలో వాటిని ఎదుర్కొనేందుకు కూడా శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తుంటారు. అయితే ఇందుకోసం జంతువులను వినియోగించడం అందరికీ తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు కూడా.. ముందుగా దాన్ని ఎలుకలు, కోతులపై ప్రయోగించారు. ఆ తర్వాతే మనుషులకు అందించారు. ముందుగా మనుషులపై ప్రయోగిస్తే.. ప్రయోగం విఫలమైన సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎలుకలు, కోతులు, కుక్కలపై పరీక్షిస్తుంటారు. అయితే చాలా ఏళ్ల క్రితం మనుషులపై ఓ రహస్య ప్రయోగం జరిగిందని చాలా మందికి తెలీదు. నింద్రపోకుండా 30రోజులు  ఉండగలరా..? ఇదే అంశంపై  శాస్త్రవేత్తలు ఐదుగురు ఖైదీలపై ప్రయోగం (sleep experiment) చేశారు. 69ఏళ్ల తర్వాత బయటపడిన దారుణం ఏంటంటే..


రెండో ప్రపంచ యుద్ధం (Second World War) జరుగుతున్న సమయంలో.. అంటే 1940లలో ఈ వినూత్న ప్రయోగం జరిగింది. ఆ సమయంలో రష్యా.. పలు శత్రు దేశాలను ఓడించి.. అక్కడి సైనికులు, ప్రజలను బంధీలుగా చేసుకుంది. అప్పట్లో రష్యన్ శాస్త్రవేత్తలకు (Russian scientists).. మనిషి నిద్ర లేకుండా జీవించగలడా అనే విషయంపై సందేహం కలిగింది. ఎలాగైనా దీనిపై పరిశోధనలు చేయాలని భావించారు. ఈ ప్రయోగం ఫలిస్తే.. తమ సైనికులు నిద్ర లేకుండా యుద్ధం చేస్తారనేది వారి భావన. అయితే ఈ ప్రయోగం కోసం వారి వద్ద బంధీలుగా ఉన్న ఖైదీలను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ముందు ఈ ఆలోచన ఉంచి.. ఎవరైతే ఈ ప్రయోగానికి ఒప్పుకొంటే, వారిని విడుదల చేస్తామంటూ షరతు పెట్టారు. అయితే దీనికి ఎవరూ ముందుకు రాకున్నా.. వారిలో ఓ ఐదుగురు మాత్రం అంగీకరించారు. దీంతో పరిశోధనను మొదలు పెట్టారు.

Viral Video: చితక్కొట్టడం అంటే ఇదేనేమో.. రాత్రి పూట నడిరోడ్డుపై ఇద్దరు యువతులు ఎలా కొట్టుకున్నారో మీరే చూడండి..!


ఈ ప్రయోగం కోసం ఓ చాంబర్‌ను సిద్ధం చేశారు. అందులో ఖైదీలకు అవసరమైనవన్నీ అందుబాటులో ఉంచారు. లోపల వారి కార్యకలాపాలను తెలుసుకునేందుకు మొత్తం కెమెరాలను ఏర్పాటు చేశారు. గది మొత్తాన్ని ప్రత్యేకమైన గాజుతో తయారు చేయించారు. తద్వారా లోపలున్న వారికి బయట ఉన్న వారు కనిపించే అవకాశం ఉండదు. బయటి వారికి మాత్రం లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. దీంతో పాటూ శాస్త్రవేత్తలు బయటి నుంచి చెప్పే సూచనలను వినేలా మైక్రోఫోన్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆక్సిజన్‌తో పాటూ ఓ ప్రత్యేక రకమైన వాయువును విడుదల చేశారు. దీని వల్ల ఖైదీలు నిద్రపోవాలని అనుకున్నా సాధ్యం కాదు. ఏర్పాట్లు చేసిన అనంతరం ఐదుగురు ఖైదీలను ఆ గదిలోకి పంపించి తాళం వేశారు.

Viral Video: ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు..? విమానాశ్రయంలో కనిపించగానే అమాంతం అతడి కాళ్లపై ఆమె ఎందుకు పడిందంటే..


మొదటి రోజు వారంతా సాధారణంగా భోజనం చేసి, హుషారుగా గడిపారు. రెండో రోజు కూడా హుషారుగానే కనిపిస్తూ.. శాస్త్రవేత్తలకు తమ పరిస్థితిని వివరించడంతో పాటూ వారు చెప్పే సూచలను కూడా పాటించారు. అయితే మూడో రోజు మాత్రం ఖైదీలు కాస్త అలసిపోయినట్లు కనిపించారు. నాలుగో రోజు వారి కళ్లు అలసిపోయినట్లు కనిపించాయి. అయితే గ్యాస్ కారణంగా వారికి నిద్ర మాత్రం రాలేదు. కానీ ఐదో రోజు మాత్రం ఖైదీలు వారిలో వారే ఏవేవో మాటలు మాట్లాడుకుంటున్నారు. శాస్త్రవేత్తల మాటలను అర్థం చేసుకునే స్థితిలో లేరని తెలుసుకున్నారు. అయినా పరిశోధనను మాత్రం ఆపలేదు.

Viral Video: బలమైన గాలులు, వర్షంలో.. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా.. రోడ్డు ఎలా దాటాడో చూడండి..


ఇక ఆరు, ఏడు, ఎనిమిదవ రోజు వారి పరిస్థితి మరింత దిగజారడం ప్రారంభించింది. నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ఇలా ఎనిమిది రోజులు పూర్తయ్యాయి. తొమ్మిదో రోజు ఐదుగురిలో ఓ ఖైదీ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలెట్టాడు. గట్టిగా అరుస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కానీ శాస్త్రవేత్తల మాటలు మాత్రం వారికి అర్థం కాలేదు. విచిత్రమైన విషయం ఏంటంటే.. ఆ ఖైదీ అంతగా అరుస్తున్నా, పక్కనున్న ఖైదీలు మాత్రం ఏమీ జరగనట్లుగా మైనంగా ఉండడం కనిపించింది. ఇలా కొన్ని గంటల తర్వాత ఆ ఖైదీ గొంతు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆక్సిజన్ స్థాయి బాగున్నా, అంతా ఊపిరి తీసుకుంటున్నా ఇలా ఎందుకు జరుగుతోందని శాస్త్రవేత్తలకు అనుమానం వచ్చింది. ప్రయోగాన్ని అంతటితో ఆపేయాలని భావించినా.. ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్న కమాండర్ మాత్రం ఒప్పుకోలేదు.

Viral Video: రోడ్డుపై ఇలాంటి కారు డ్రైవర్లు కూడా ఉంటారు.. కాస్త చూసుకుని వెళ్లండి..


పదో రోజు నుంచి పరిస్థితి దారుణంగా మారింది. 13 రోజు వచ్చేసరికి ఖైదీల్లో ఎలాంటి కదలికలూ లేకపోవడంతో అంతా చనిపోయారని భావించారు. అయితే 15 రోజు వచ్చే సరికి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు భావించారు. తలుపులు తీయగానే.. బయటికి వచ్చే ప్రయత్నం చేస్తే కాల్చేస్తామంటూ బెదిరించి లోపలికి వెళ్లారు. అయితే లోపలికి వెళ్లగానే ఆశ్చర్యకరంగా అంతా బతికే ఉన్నారు. దీనికితోడు తాము లోపలే ఉంటామంటూ చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. మరోవైపు గదిలో నేల, గోడలపై రక్తం ఉండడం చూసి శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఖైదీలు ఒకరి మాంసాన్ని ఒకరు కొరికి తిన్నట్లుగా గుర్తించారు. తర్వాత తలుపులు వేసి, వారంతా బయటికి వచ్చారు. అయితే కాసేపటికి గ్యాస్ ఆఫ్ చేయడంతో వారిలో ఓ ఖైదీ చనిపోయాడు. అతడి మృతదేహాన్ని బయటికి తీసిన అనంతరం.. ప్రయోగాన్ని ఆపేయాలని భావించినా.. కమాండర్ మాత్రం అంగీకరించలేదు.

ATM Pin Number: ఏటీఎం కార్డు పిన్ నెంబర్ కేవలం 4 అక్షరాలే ఎందుకు ఉంటాయి..? అసలు కారణాలివే..!


తర్వాత ఖైదీలతో పాటూ ఓ శాస్త్రవేత్తను వారితో లోపల ఉంచాలని కమాండర్ భావించాడు. ఇందుకు ఎవరూ ఒప్పుకోకపోవడంతో వారిలో ఒకరిని కాల్చి చంపారు. చివరకు ఒక శాస్త్రవేత్తను బలవంతంగా లోపలికి పంపించారు. అయితే లోపల ఖైదీలతో ఉన్న శాస్త్రవేత్త.. కాసేపటికే భయభ్రాంతులకు గురయ్యాడు. ఖైదీలంతా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం మొదలెట్టారు. చివరకు వారిని బయటికి తీసి, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారిలో ముగ్గురు చనిపోయారు. చికిత్స అనంతరం గదిలోకి వెళ్తానని ఉన్న ఒక్క ఖైదీ పట్టుబట్టడంతో 16వ రోజు అతన్ని లోపలికి పంపించారు. అయితే గదిలో అతడి వింత ప్రవర్తనను చూసి శాస్త్రవేత్త భయపడ్డాడు. చివరికి అతన్ని చంపేయడమే మేలని భావించి కాల్చి చంపేశారు. ఇలా ఆ ప్రయోగానికి ఫుల్‌స్టాప్ పడింది. అయితే ఈ ప్రయోగం గురించి 2009 వరకూ ఎవరికీ తెలియదు. క్రిపీపాస్టా అనే వెబ్‌సైట్ మొదటిసారిగా ఈ ప్రయోగం గురించి కథనం రావడంతో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కథనాలను రష్యా మాత్రం ఖండిస్తోంది. తాము ఎలాంటి ప్రయోగాలూ చేయలేదంటూ చెప్పుకొస్తోంది. 

శ్రీనివాస రామానుజన్ మళ్లీ పుట్టారా..? ఈ బాలుడు చదివేది 3వ తరగతే.. కానీ పదో తరగతి విద్యార్థులకు కూడా లెక్కల పాఠాలు..!



Updated Date - 2022-10-12T00:35:25+05:30 IST