Viral Video: బలమైన గాలులు, వర్షంలో.. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా.. రోడ్డు ఎలా దాటాడో చూడండి..

ABN , First Publish Date - 2022-10-01T02:42:01+05:30 IST

బలమైన గాలులతో కూడిన వర్షం అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి దాటికి కొన్నిసార్లు పెంకుటిళ్లు, వాహనాలు కూడా ఎగిరిపడుతుంటాయి. ఆ సమయంలో ఇక..

Viral Video: బలమైన గాలులు, వర్షంలో.. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా.. రోడ్డు ఎలా దాటాడో చూడండి..

బలమైన గాలులతో కూడిన వర్షం అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి దాటికి కొన్నిసార్లు పెంకుటిళ్లు, వాహనాలు కూడా ఎగిరిపడుతుంటాయి. ఆ సమయంలో ఇక మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి సమయాల్లో బయటికి రావడానికి ఎవరూ సాహసించరు. కొన్ని సార్లు ఇలాంటి సమయాల్లో ప్రాణాలు పొగొట్టుకున్న వాళ్లను కూడా చాలా మందిని చూశాం. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మనం చూడబోయే వీడియోలో ఓ వ్యక్తి చేసిన సాహసం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. బలమైన గాలులు, వర్షంలో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా అతడు రోడ్డు దాటిన విధానం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు..


ప్లోరిడాలో (Florida) భారీ ఈదురుగాలులు (strong winds), వర్షం (rain) పడుతున్న సమయంలో జిమ్ కాంటోర్ అనే రిపోర్టర్.. దాన్ని కవర్ చేసేందుకు వెళ్లాడు. అయితే గాలుల వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ గాలుల దాటికి ఇనుప బోర్డులు కూడా కొట్టుకుపోతున్నాయి. ఆ సమయంలో రోడ్డు మధ్యలో ఉన్న జిమ్ కాంటోర్.. చాలా తెలివిగా ప్రవర్తించాడు. ఏమాత్రం భయపడకుండా మెల్లగా కాళ్లను కొంచెం కొంచెం జరుపుతూ ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్తపడతాడు. అక్కడే ఉన్న ఇనుప బోర్డును పట్టుకుని కొద్దిసేపు ఆగుతాడు. అతడి పక్క నుంచే చెట్టు కొమ్మలు, వివిధ వస్తువులు గాలుల దాటికి కొట్టుకుపోతుంటాయి. అయినా అతడు మాత్రం బోర్డును వదలకుండా పట్టుకుంటాడు. కాసేపటి తర్వాత అడుగులో అడుగు వేసుకుంటూనే పక్కనే ఉన్న బిల్డింగ్‌లోకి క్షేమంగా చేరుకుంటాడు. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్.. ఇతడు టాలెంట్ అద్భుతం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

పెళ్లి మంటపంలో వరుడి ముందే.. స్నేహితులతో కలిసి గదిలోకి వెళ్లిన యువతి.. కాసేపటికి అంతా షాకయ్యేలా...





Updated Date - 2022-10-01T02:42:01+05:30 IST