ఆస్పత్రి బెడ్ మీద కనపడని భార్య.. మొత్తం వెతికినా ఫలితం లేకపోవడంతో.. చివరగా డాక్టర్ గదిలో కర్టన్ తీసి చూడగా..
ABN , First Publish Date - 2022-05-30T02:48:46+05:30 IST
వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణాలు పోస్తూ ఎంతో మంది వైద్యులు.. దేవుడికి మారో రూపంలా నిలుస్తున్నారు. అయితే కొందరు వైద్యులు మాత్రం సభ్యసమాజం..
వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణాలు పోస్తూ ఎంతో మంది వైద్యులు.. దేవుడికి మారో రూపంలా నిలుస్తున్నారు. అయితే కొందరు వైద్యులు మాత్రం సభ్యసమాజం తల దించుకునే పనులు చేస్తూ.. వైద్య వృత్తికే మాయని మచ్చగా నిలుస్తున్నారు. తాజాగా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఆస్పత్రి బెడ్ మీద భార్య కనపడకపోవడంతో.. భర్త కంగారుగా మొత్తం వెతికాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరగా డాక్టర్ గదిలోని కర్టన్ తీసి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
జార్ఖండ్ రాష్ట్రం గొడ్డా జిల్లా మెహ్రామా బ్లాక్‌లోని బనౌద పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. మే 26న దంపతుల మధ్య గొడవ జరిగింది. భర్త మీద కోపంతో భార్య విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే పూర్తిగా కోలుకునేందుకు ఆస్పత్రిలో కొన్ని రోజులు అడ్మిట్ కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో రెండో రోజు భార్యను చూడటానికి వచ్చిన భర్తకు.. బెడ్ మీద ఆమె కనిపించలేదు. దీంతో కంగారుగా ఆస్పత్రి మొత్తం వెతికాడు. అయినా ఎక్కడా కనిపించలేదు.
హోటల్ గదిలో మహిళను కలిసి వచ్చిన అధికారి.. మరుసటి రోజే అలా అవుతుందని అతడు కలలో కూడా ఊహించలేదు..
చివరగా డాక్టర్ గదిలో కర్టన్ తొలగించి చూడగా.. తన భార్య వద్ద వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించడం కనిపించింది. ఆమెకు మత్తు మందు ఇచ్చిన వైద్యుడు.. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే గమనించిన భర్త.. వైద్యుడిని నిలదీశాడు. జనం మొత్తం గుమికూడడంతో వైద్యుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి వైద్యుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.