Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 29 May 2022 18:40:33 IST

హోటల్ గదిలో మహిళను కలిసి వచ్చిన అధికారి.. మరుసటి రోజే అలా అవుతుందని అతడు కలలో కూడా ఊహించలేదు..

twitter-iconwatsapp-iconfb-icon
హోటల్ గదిలో మహిళను కలిసి వచ్చిన అధికారి.. మరుసటి రోజే అలా అవుతుందని అతడు కలలో కూడా ఊహించలేదు..

మహిళలను చూడగానే ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దారుణాలకు పాల్పడే వారిని గతంలో ఎంతో మందిని చూశాం. అలాగే ప్రేమ పేరుతో మగవారిని ముగ్గులోకి దింపి, చివరకు మోసాలకు పాల్పడే మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారు పైకి ప్రేమగా మాట్లాడుతున్నా.. వారి మనసులో మాత్రం కుట్ర కోణం దాగి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. హోటల్ గదికి వెళ్లి మహిళను కలిసి వచ్చిన అధికారి.. మరుసటి రోజే అలా అవుతుందని ఊహించలేకపోయాడు. ఇంతకీ అసలు జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ అయోధ్య పరిధిలో ఓ వ్యక్తి ప్రభుత్వ శాఖలో విధులు నిర్వర్తిస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం ఓ మహిళ పని నిమిత్తం అధికారి వద్దకు వచ్చింది. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. పని పేరుతో రోజూ ఆఫీసుకు వెళ్లి అతడిని కలుస్తూ ఉండేది. ఇలా వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఓ రోజు సీక్రెట్‌గా మాట్లాడాలంటూ హోటల్ గదికి రమ్మని పిలిచింది. అక్కడికి వెళ్లిన అధికారితో కాసేపు ప్రేమగా మాట్లాడి, తర్వాత దుస్తులు మొత్తం విప్పించింది. అదే సమయంలో మరో వ్యక్తి అధికారికి తెలీకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. మహిళతో గడిపి ఇంటికి వెళ్లిన అధికారికి మరుసటి రోజు ఫోన్ వచ్చింది.

మానసిక ఒత్తిడి కారణంగా భార్యను దగ్గరకు రానీయని భర్త.. అనుమానం వచ్చిన భార్య.. చివరకు విచారించగా..

‘‘అర్జెంట్‌గా రూ.5లక్షలు ఇవ్వకపోతే నీ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తా’’ అంటూ మహిళ హెచ్చరించింది. దీంతో ఖంగుతిన్న అధికారి చివరకు రూ.3లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకొన్నాడు. అయితే పదే పదే మహిళ నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కడంపూర్‌కు చెందిన ఖుష్బూ అలియాస్ సీమా అలియాస్ షామాను అరెస్ట్ చేశారు. వీరి వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు గుర్తించారు. వీరి ముఠాలో ఎవరెవరు ఉన్నారు, ఇలా ఎంతమందిని మోసం చేశారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మొబైల్ షాపు నిర్వాహకుడితో వివాహితకు పరిచయం.. ఉపాధి నిమిత్తం భర్త దూరంగా ఉండడంతో... ఓ రోజు ఏకంగా ఇంటికే పిలిచి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

నలభై ఏళ్ల వయసులో దంపతుల మధ్య గొడవలు.. భర్తపై విరక్తి చెంది రోజూ ఫేస్‌బుక్‌లో సెర్చింగ్... చివరకు యువకుడి పరిచయంతో..ఫోన్ వచ్చిందని రాత్రి బయటకు వెళ్లిన 25 ఏళ్ల కుర్రాడు.. తెల్లారేసరికి రైల్వే బ్రిడ్జ్ కింద శవంగా.. 19 ఏళ్ల ఆ కుర్రాడి పనేనని.. పెళ్లిలో దండలు మార్చుకుంటుండగా అనుకోని ఘటన.. సిగ్గుతో తల తిప్పుకొన్న వధువు.. ఇంతకీ ఏం జరిగిందంటే.. videoటాయిలెట్‍‌లో కూర్చుని ఉండగా... అనుకోకుండా వింత శబ్ధం... ఏంటా అని తిరిగి చూస్తే.. videoAmerica లో భర్తకు జాబ్.. ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా కాపురానికి తీసుకెళ్లకపోవడంతో ఆ భార్య అనుమానంతో ఆరా తీస్తే..ఈ దొంగ చాలా విచిత్రంగా ఉన్నాడే.. ఇంట్లో చోరీ చేసి.. చివరగా టీవీపై అతడు రాసిన సందేశం చూసి యజమాని షాక్..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.