అర్ధరాత్రి.. లైట్ల వెలుగుపడి రోడ్డు పక్కన కనిపించిందో ఆకారం.. అనుమానంతో బస్సును ఆపి ఆ డ్రైవర్ వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-08-10T21:29:24+05:30 IST

ప్రయాణికులతో నిండిన ఓ బస్సు రాత్రి వేల గమ్యస్థానానికి బయలుదేరింది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో బస్సు వేగంగా దూసుకెళ్తోంది. ఓ మలుపు వద్దకు రాగానే డ్రైవర్ వేగాన్ని కాస్త..

అర్ధరాత్రి.. లైట్ల వెలుగుపడి రోడ్డు పక్కన కనిపించిందో ఆకారం.. అనుమానంతో బస్సును ఆపి ఆ డ్రైవర్ వెళ్లి చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం

ప్రయాణికులతో నిండిన ఓ బస్సు రాత్రి వేల గమ్యస్థానానికి బయలుదేరింది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో బస్సు వేగంగా దూసుకెళ్తోంది. ఓ మలుపు వద్దకు రాగానే డ్రైవర్ వేగాన్ని కాస్త తగ్గించాడు. బస్సు లైటు వెలుతురులో దూరంగా ఏదో ఆకారం కనిపించింది. దీంతో అనుమానం వచ్చి బస్సును అక్కడే ఆపాడు. బస్సు దిగిన డ్రైవర్.. ఆ ఆకారం వద్దకు వెళ్లి చూసి షాక్ అయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..


హర్యానా (Haryana) రాష్ట్రం రేవారీ జిల్లా పరిధి ఢిల్లీ-జైపూర్ హైవేపై గర్హి ప్రాంత సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో మంగళవారం రాత్రి  ఢిల్లీ-జైపూర్ హైవేలో (Delhi Jaipur Highway) వెళ్తూ ఉంది. గర్హి అలవల్‌పూర్ గ్రామ సమీపానికి వచ్చేసరికి.. సరిగ్గా అర్ధరాత్రి అయింది. గ్రామ సమీపంలోని మలుపు వద్ద బస్సు నిదానంగా వెళ్తోంది. మలుపు తిరిగే సమయంలో బస్సు లైటు వెలుతురులో దూరంగా ఓ ఆకారం కనిపించింది. దీంతో బస్సును ఆపిన డ్రైవర్.. ఆ ఆకారం వద్దకు వెళ్లాడు. సమీపానికి వెళ్లి చూస్తే.. మహిళ మృతదేహం (woman dead body) పడి ఉంది.

extramarital affair: ప్రియుడిని రోజూ కలవాలనే ఉద్దేశంతో.. ఇంట్లో పిల్లలు చూస్తుండగా మహిళ చేసిన నిర్వాకం..


దీంతో డ్రైవర్‌తో పాటూ ప్రయాణికులంతా షాక్ అయ్యారు. మహిళ ముఖంపై గాయాలు ఉండడంతో పాటూ మెడకు చున్నీ కట్టి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగులు మహిళ మెడకు చున్నీ బిగించి, హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలి వయస్సు 28 నుంచి 30ఏళ్ల వయసు మధ్య ఉన్నట్లు తెలిపారు. మహిళ ఫొటోను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Atrocity on girlfriend: రాత్రి వేళ ఇంట్లోకి వచ్చిన ప్రియుడు, అతడి స్నేహితుడు.. కాసేపటికి యువతి కాళ్లు, చేతులు కట్టేసి మరీ..



Updated Date - 2022-08-10T21:29:24+05:30 IST