ఇన్నాళ్లూ.. తమ కూతురు కాలుజారి కాలువలో పడిందనుకున్నారు.. కానీ ఇంట్లో పరుపు శుభ్రం చేస్తుండగా.. బయటపడిన పేపర్‌తో..

ABN , First Publish Date - 2022-08-17T22:54:28+05:30 IST

తమ కుమార్తె ఇన్నాళ్లూ కాలువలో పొరపాటున జారి పడి మృతి చెందిందనుకున్నారు. రోజూ కూతురు జ్ఞాపకాలను తలచుకుంటూ బతుకుతున్నారు. పోలీసులు కూడా కుటుంబ సభ్యులు..

ఇన్నాళ్లూ.. తమ కూతురు కాలుజారి కాలువలో పడిందనుకున్నారు.. కానీ ఇంట్లో పరుపు శుభ్రం చేస్తుండగా.. బయటపడిన పేపర్‌తో..
ప్రతీకాత్మక చిత్రం

తమ కుమార్తె ఇన్నాళ్లూ కాలువలో పొరపాటున జారి పడి మృతి చెందిందనుకున్నారు. రోజూ కూతురు జ్ఞాపకాలను తలచుకుంటూ బతుకుతున్నారు. పోలీసులు కూడా కుటుంబ సభ్యులు అనుకున్న విధంగానే కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఇటీవల కుటుంబ సభ్యులు ఇల్లు శుభ్రం చేస్తుండగా.. పరుపు కింద పేపర్ కనిపించింది. దీంతో తమ కుమార్తె మృతికి సంబంధించిన అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే..


హర్యానా (Haryana) రాష్ట్రం రేవారి జిల్లా కసౌలా అనే గ్రామంలో సుభాష్ అనే వ్యక్తి భార్య, కూతురు రింకీతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆనందంగా సాగుతున్న వీరి జీవితాల్లో అనుకోని విషాదం (Tragedy) చోటు చేసుకుంది. జూలై 28న సుభాష్ కూతురు కాలువలో శవమై తేలింది. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. అంతవరకూ బాగున్న కూతురు.. ఆ మరుసటి రోజే ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని.. తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. పొరపాటున కాలుజారి కాలువలో పడిపోయి ఉంటుందని అంతా భావించారు. పోలీసులు కూడా ఇలాగే కేసు నమోదు చేశారు. అయితే మంగళవారం ఇల్లు శుభ్రం చేస్తుండగా.. రింకీ పడక గదిలో పరుపు కింద పేపర్ కనిపించింది.

husband ఇంట్లో లేడని తెలుసుకుని లోపలికి వెళ్లిన యువకుడు.. చివరకు అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం రావడంతో..


అందులో తమ కూతురు రాసింది చదవి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ‘‘ నాన్నా, నన్ను క్షమించు. నాన్న నా తప్పు కాదు. మా అమ్మను జాగ్రత్తగా చూసుకో, నేను లోకాన్ని విడిచి వెళ్తున్నాను. గ్రామానికి చెందిన బల్వాన్.. రోజూ నన్ను ఫాలో అవుతున్నాడు. స్నేహం చేయాలని బెదిరిస్తున్నాడు. ఈ టార్చర్ నేను భరించలేను. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నాను’’.. అని రాసి ఉంది. సూసైడ్ నోట్‌ను పోలీసులకు అందజేసి, నిందితుడు బల్వాన్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంట్లోనే శవాన్ని పూడ్చేశాడు.. ఫోన్‌ను కంటైనర్‌పై పడేశాడు.. అన్నీ దృశ్యం సినిమాలో చూపించినట్టే చేశాడు కానీ..



Updated Date - 2022-08-17T22:54:28+05:30 IST