13 ఏళ్ల క్రితం జార్జియాను లక్ష్యంగా చేసుకున్న రష్యా... ఇప్పుడు అదే వ్యూహంతో ఉక్రెయిన్‌పై దాడి!

ABN , First Publish Date - 2022-02-24T17:21:24+05:30 IST

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి దిగింది.

13 ఏళ్ల క్రితం జార్జియాను లక్ష్యంగా చేసుకున్న రష్యా... ఇప్పుడు అదే వ్యూహంతో ఉక్రెయిన్‌పై దాడి!

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి దిగింది. ఇలా వ్యవహరించడం ఆ దేశానికి కొత్తేమీ కాదు. ఇంతకుముందు రష్యా.. క్రిమియా జార్జియాలపైన కూడా తన శక్తిని ప్రదర్శించింది. నాడు జార్జియాతో యుద్ధ సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి తీసిన శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. చిత్రాల ప్రకారం, ఉక్రెయిన్ సరిహద్దులో 100కు పైగా రష్యన్ వాహనాలు ఉన్నాయి. ఇంతే కాదు యుద్ధంలో గాయపడే సైనికుల చికిత్స కోసం సరిహద్దులో తాత్కాలిక ఆసుపత్రులను కూడా నిర్మించారు. రష్యా అక్కడ హెలిప్యాడ్‌ను నిర్మించిందని, పెద్ద సంఖ్యలో టెంట్లు కూడా కనిపిస్తున్నాయని అమెరికాకు చెందిన మెక్సర్ అనే సంస్థ విడుదల చేసిన చిత్రాలు తెలియజేస్తున్నాయి. రష్యా మరో దేశంతో దాడికి దిగడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు రష్యా.. క్రిమియా, జార్జియాలతో కూడా  యుద్ధానికి దిగింది. అయితే జార్జియా-రష్యా మధ్య యుద్ధానికి కారణం ఏమిటి? 13 సంవత్సరాల క్రితం రష్యా ఏ వ్యూహాన్ని అనుసరించింది?లాంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. విదేశాంగ విధాన నివేదిక ప్రకారం.. బీజింగ్‌లో వేసవి ఒలింపిక్ క్రీడలకు ముందు అంటే 2008లో రష్యా - జార్జియా మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో చైనా అసంతృప్తిని తొలగించడానికి రష్యా.. ఒలింపిక్ క్రీడలు ముగిసే వరకు వేచి ఉంది. ఇప్పుడు రష్యా కూడా అదే చేసింది. బీజింగ్‌లో వింటర్ గేమ్స్ వీడ్కోలు తర్వాత.. యుద్ధానికి సన్నాహాలు చేసింది. 2008లో జార్జియా నాటోలో చేరకూడదని రష్యా కోరింది. దీనిపై రష్యా విజయం సాధించింది.


 ఉక్రెయిన్‌పై దాడి చేసి.. తిరిగి అదే పని చేయడానికి రష్యా ప్రయత్నిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధం తొలి దశలలో 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)ను సభ్యదేశాల ఉమ్మడి రక్షణ కోసం ఒక రాజకీయ, సైనిక కూటమిగా ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ నాటోలో చేరకూడదని రష్యా కోరుతోంది. ఉక్రెయిన్ నాటోలో చేరితే రష్యాకు ఇబ్బందులు తప్పవు. ఇదే జరిగితే నాటో బలగాలు రష్యా సరిహద్దుకు చేరుకోవడంతోపాటు ప్రతీకార చర్యలు పెరుగుతాయి. ఇది మాత్రమే కాదు 2008లో రష్యా.. జార్జియాలోని అబ్ఖాజియా, దక్షిణ ఒస్సేటియాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించింది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ లుహాన్స్క్ ప్రాంతాన్ని గుర్తించింది. డిడబ్లు తెలిపిన వివరాల ప్రకారం నాటో ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక సంస్థ. దీని ఉనికి ప్రపంచవ్యాప్తంగా ఉంది. నాటో అనేది ఉత్తర అమెరికా, ఐరోపాలోని ఒక సాధారణ రాజకీయ, సైనిక సంస్థ. ఇది 1949 సంవత్సరంలో ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఈ సంస్థ ప్రధాన లక్ష్యం సోవియట్ యూనియన్ పరిధిని పరిమితం చేయడం. ఇంతేకాకుండా ఐరోపా ఖండంలో రాజకీయ ఐక్యతను స్థాపించడానికి ఐరోపాలో జాతీయవాద ఆలోచనలను అణచివేసేందుకు అమెరికా దీనిని ఉపయోగించింది. ఉక్రెయిన్‌లోకి సేనల ప్రవేశానికి రష్యా డొనెట్స్క్ మరియు లుహాన్స్క్ ప్రాంతాలను ఎంచుకుంది. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది ఇక్కడ రష్యన్ మాట్లాడే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ప్రదేశాలలో ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పెరుగుతున్న వేర్పాటువాదం రెండవ కారణం. అందుకే ఉక్రెయిన్‌లో సైన్యం ప్రవేశానికి రష్యా ఈ ప్రదేశాలను ఎంపిక చేసింది. ఉక్రెయిన్‌పై దాడి చేయడంలో రష్యా విజయం సాధిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

మంచు తుపాన్‌లో చిక్కుకుపోయిన పర్యాటకుల తరలింపు

ఈ యుద్ధానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్‌ను కింద ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి చూడగలరు..

13 ఏళ్ల క్రితం జార్జియాను లక్ష్యంగా చేసుకున్న రష్యా... ఇప్పుడు అదే వ్యూహంతో ఉక్రెయిన్‌పై దాడి! (11:51AM)


ఉక్రెయిన్ వెళ్లిన ఎయిరిండియా విమానం.. మధ్యలోనే వెనక్కి.. ఆందోళనలో భారతీయులు! (11:44AM)


యుద్ధంలో ఉక్రెయిన్ గెలుస్తోంది.. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి (11:39AM)


ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం...వంద డాలర్లకు పెరిగిన క్రూడాయిల్ ధర (10:54AM)


ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 350 మంది తెలుగు విద్యార్థులు.. భయాందోళనల్లో తల్లిదండ్రులు! (09:46AM)


బయటివారు జోక్యం చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటాం...వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరిక (09:35AM)


ఉక్రెయిన్‌ నుంచి పెద్ద సంఖ్యలో తిరిగొచ్చిన భారత విద్యార్థులు (07:58AM)




Updated Date - 2022-02-24T17:21:24+05:30 IST