Virginity Test: కొత్త పెళ్లి కూతురికి కన్యత్వ పరీక్ష.. ఆమె ఫెయిల్ అయిందని రూ.10 లక్షలు అడిగిన అత్తమామలు.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-06T02:25:57+05:30 IST

పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన యువతికి దారుణ అవమానం ఎదురైంది.

Virginity Test: కొత్త పెళ్లి కూతురికి కన్యత్వ పరీక్ష.. ఆమె ఫెయిల్ అయిందని రూ.10 లక్షలు అడిగిన అత్తమామలు.. చివరకు..

పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన యువతికి దారుణ అవమానం ఎదురైంది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు చేదు అనుభవం ఎదురయింది. భర్త, అత్తమామలు ఆమెకు కన్యత్వ పరీక్ష నిర్వహించారు.. అందులో ఆమె ఫెయిల్ కావడంతో (Woman Fails Virginity Test) పంచాయితీ నిర్వహించి రూ.10 లక్షలు జరిమానా విధించారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌ (Rajasthan)లో వెలుగు చూసింది. వధువు ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


ఇది కూడా చదవండి..

Mother: కొడుకు కోసం పులితో పోరాడిన తల్లి.. తీవ్ర గాయాల పాలైనా వదలకుండా పోరాటం.. చివరకు..


భిల్వారా జిల్లాకు చెందిన బాధితురాలికి (24) బాగోర్‌కు చెందిన ఒక వ్యక్తితో మే11వ తేదీన వివాహం జరిగింది. కాగా, వరుడి కుటుంబ సాంప్రదాయం ప్రకారం.. పెళ్లి తర్వాత `కుక్డి` విధానంలో వధువకు కన్యత్వ పరీక్ష (Virginity Test)నిర్వహించారు. ఆ కన్యత్వ పరీక్షలో వధువు విఫలమయింది. దీంతో అత్తింటివారు వధువును నిలదీయగా ఆమె షాకింగ్ విషయం చెప్పింది. తన ఇంటి దగ్గర ఉండే ఓ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పుకొచ్చింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను చితకబాదారు. గ్రామ పెద్దల ఎదుట పంచాయితీ నిర్వహించారు. పంచాయతీ పెద్దలు వధువు కుటుంబానికి ఏకంగా రూ.10 లక్షల జరిమానా విధించారు. అయితే ఆ డబ్బులు చెల్లించకపోవడంతో వధువు కుటుంబాన్ని అత్తింటివారు వేధించారు. దీంతో, వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వధువు ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 


రాజస్థాన్‌లో సాంసీ సమాజంలో `కుక్డీ` ఆచారం ఉంది. ఆ ఆచారం ప్రకారం పెళ్లి తర్వాత జరిగే ఫస్ట్ నైట్ రోజున వధువు తన కన్యత్వాన్ని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి రాత్రి మంచంపై ఓ తెల్లని దుప్పటి వేస్తారు. ఇద్దరూ కలిసిన తర్వాత ఆ దుప్పటిపై రక్తపు మరకలు పడాలి. ఆ రక్తపు మరకలను మరుసటి రోజు తమ కులంలోని ప్రజలకు చూపించాలి. రక్తపు మరకలు ఉంటే నవ వధువు కన్య అని, లేకపోతే కాదు అని భావిస్తారు. ఆ పరీక్షలో ఫెయిల్ అయిన వధువు కుటుంబం నుంచి వరుడి కుటుంబం మరింత కట్నం డిమాండ్ చేస్తుంది. 

Updated Date - 2022-09-06T02:25:57+05:30 IST