Mother: కొడుకు కోసం పులితో పోరాడిన తల్లి.. తీవ్ర గాయాల పాలైనా వదలకుండా పోరాటం.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-05T21:37:04+05:30 IST

ఓ తల్లి తన 15 నెలల బిడ్డను రక్షించుకునేందుకు పులితో (Mother fought with tiger) పోరాడింది.

Mother: కొడుకు కోసం పులితో పోరాడిన తల్లి.. తీవ్ర గాయాల పాలైనా వదలకుండా పోరాటం.. చివరకు..

ఓ తల్లి తన 15 నెలల బిడ్డను రక్షించుకునేందుకు పులితో (Mother fought with tiger) పోరాడింది.. తీవ్ర గాయాల పాలైనా ఆమె తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు.. 20 నిమిషాల పాటు పోరాడి పులి బారి నుంచి తన కుమారుడిని రక్షించింది.. ఆ క్రమంలో ఆమె తీవ్ర గాయాల పాలైంది.. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను జబల్‌పూర్‌కు తరలించారు.. మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన జరిగింది.


ఇది కూడా చదవండి..

Viral Video: డబ్బులు ఇస్తావా? లేదా?.. తల్లిని బూతులు తిడుతూ వీరంగం వేసిన బాలుడు.. వీడియో వైరల్!


మాన్‌పూర్‌ బఫర్‌ జోన్‌కు సమీపంలోని బస్తీలో నివాసముంటున్న అర్చన అనే మహిళ ఆదివారం ఉదయం 10 గంటలకు తన కుమారుడు రాజ్‌వీర్‌తో కలిసి పార్క్‌కు వెళ్లింది. ఇంతలో పొదల్లో ఉన్న పులి ఫెన్సింగ్ దూకి బయటకు వచ్చి చిన్నారిని పట్టుకుంది. కొడుకును కాపాడేందుకు అర్చన పులితో పోరాడింది. పులి తన పంజాతో ఆమె ఛాతిపై బలంగా కొట్టింది. పులి గోర్లు ఆమె ఊపిరితిత్తులను తీవ్రంగా గాయపరిచాయి. అయినా ఆమ తన పోరాటాన్ని ఆపలేదు. సుమారు 20 నిమిషాల పాటు అర్చన పులితో పోరాడింది. 


అర్చన కేకలు విన్న గ్రామస్థులు కర్రలతో అక్కడికి చేరుకోగా, పులి అడవి వైపు పరుగులు తీసింది. అర్చనను గ్రామస్థులు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అర్చన ఊపిరితిత్తుల్లో గాయాలు కావడంతో పాటు మెడ కూడా విరగడంతో ఆమెను జబల్పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2022-09-05T21:37:04+05:30 IST