Aadhar card: ఆధార్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం.. దేశ భద్రత కోసం అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్..!

ABN , First Publish Date - 2022-09-21T22:06:41+05:30 IST

ప్రస్తుతం దేశ ప్రజల గుర్తింపు విషయంలో ఆధార్ కార్డు కీలకంగా మారింది.

Aadhar card: ఆధార్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం.. దేశ భద్రత కోసం అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్..!

ప్రస్తుతం దేశ ప్రజల గుర్తింపు విషయంలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ లేకపోతే గుర్తింపు లేనట్టుగానే భావిస్తున్నారు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 13 ఏళ్ల కిందట ఈ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఆధార్ కార్డుల విషయంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనను అమలు చేయబోతున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (DoIT) అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడిన వారి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ దాదాపు వంద శాతం పూర్తయింది. దేశవ్యాప్తంగా 134 కోట్ల ఆధార్ రిజిస్ట్రేషన్‌లు జరిగాయని, ఇందులో అందరూ వయోజనులేనని DoIT పేర్కొంది.


ఇది కూడా చదవండి..

KBC Show: ఇంటర్ వరకే చదివి కేబీసీ షోలో ఏకంగా రూ.కోటి గెలుచుకున్న మహిళ కథ ఇదీ.. 22 ఏళ్లుగా ప్రయత్నిస్తూ..


ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి కొత్త ఆధార్ నమోదు ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి  దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని కేంద్రాలలో మాత్రమే జరుగుతుంది. వచ్చే నెల 1 నుంచి  బ్యాంకులు, పోస్టాఫీసులతో సహా చాలా చోట్ల పనిచేస్తున్న ఆధార్ కేంద్రాలను మూసివేస్తారు. కేవలం జిల్లా, బ్లాక్ స్థాయిలో ఎంపిక చేసిన కేంద్రాలలో మాత్రమే నమోదు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ కేంద్రాలను ఎక్కడ ప్రారంభించాలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. నకిలీ ఆధార్ నమోదుతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతోనే UIDAI ఈ నిర్ణయం తీసుకుంది. 


ఈ నిర్ణయం వల్ల భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న వ్యక్తులు ఆధార్ తీసుకునే ప్రక్రియ చాలా వరకు కంట్రోల్ అవుతుందని UIDAI భావిస్తోంది. పిల్లల వయసు ఐదేళ్లకు లోపు ఉంటే వారికి వారి ఫోటో ఆధారంగా, అలాగే వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్స్ ద్వారా ఆధార్ కార్డును జారీ చేస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోతే సంరక్షుల బయోమెట్రిక్స్ ద్వారా చిన్న పిల్లలకు ఆధార్ జారీ చేస్తున్నారు.

Updated Date - 2022-09-21T22:06:41+05:30 IST