KBC Show: ఇంటర్ వరకే చదివి కేబీసీ షోలో ఏకంగా రూ.కోటి గెలుచుకున్న మహిళ కథ ఇదీ.. 22 ఏళ్లుగా ప్రయత్నిస్తూ..

ABN , First Publish Date - 2022-09-21T21:01:56+05:30 IST

కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati) కార్యక్రమంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ముందు

KBC Show: ఇంటర్ వరకే చదివి కేబీసీ షోలో ఏకంగా రూ.కోటి గెలుచుకున్న మహిళ కథ ఇదీ.. 22 ఏళ్లుగా ప్రయత్నిస్తూ..

కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati) కార్యక్రమంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ముందు హాట్ సీట్‌లో కూర్చుని ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి డబ్బులు గెలుచుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అయితే కొందరికి మాత్రమే ఆ అవకాశం వస్తుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కి చెందిన కవితా చావ్లాకు (Kavita Chawla became the first crorepati) తాజా సీజన్‌లో అలాగే అవకావం వచ్చింది. ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఏకంగా 22 సంవత్సరాలుగా ప్రయత్నిస్తోంది. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూసింది. ఇంటర్‌తోనే చదువు ఆపేసిన ఆమె KBC కోసం 21 సంవత్సరాల 10 నెలలుగా నిరంతరాయంగా చదువుతూనే ఉంది. ఎట్టకేలకు ఆమె కల నెరవేరింది. 


ఇది కూడా చదవండి..

Donkey: తెలివి అంటే మనోడిదే.. ఈ గాడిదపై సోలార్ పానెల్‌ను కట్టడం వెనుక కథేంటో తెలిస్తే..



తాజాగా ప్రసారమవుతున్న KBC-14 సీజన్‌లో కవిత హాట్ సీట్‌లోకి వెళ్లింది. అంతేకాదు ఏకంగా కోటి రూపాయలు గెలుచుకుని ఈ సీజన్‌లో ఆ ఘనత సాధించిన తొలి మహిళా కంటెస్టెంట్‌గా నిలిచింది. `KBCలో ఈ స్థానానికి చేరుకున్న మొదటి కొల్హాపూర్ వాసిని నేను. నేను తాబేలు వేగంతో నడిచి మిలియనీర్‌గా మారాను. KBCలోకి ప్రవేశించడానికి నేను 21 సంవత్సరాల 10 నెలలుగా ప్రయత్నిస్తున్నా. అన్ని సార్లూ నాకు నిరాశే ఎదురైంది. అయినా నేను ఆశ కోల్పోకుండా ప్రయత్నించాను. నేను చదువుకుంటూ ఉంటే మా అత్తగారు ఇంటిని చూసుకునేది. నా భర్త నాకు పుస్తకాలు కొని తెచ్చేవాడు. 


2000 సంవత్సరంలో నా కొడుకును ఒడిలో పెట్టుకుని KBC సీజన్ 1 మొదటి ఎపిసోడ్ చూడడం ఇంకా గుర్తింది. ఆ కార్యక్రమం నాకు ఎంతో నచ్చింది. ఎలాగైనా హాట్ సీట్ చేరుకోవాలని కలలు కన్నాను. అప్పట్నుంచి ప్రతి ఏడాది నేను KBC ఎంట్రీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా. కొన్నిసార్లు కాల్ రాలేదు. కొన్ని సార్లు వచ్చినా నాకు తెలియలేదు. గతేడాది మొదటిసారి కరోడ్‌పతి కార్యక్రమంలోకి ఎంట్రీ దొరికింది. అయితే ఫాస్టెస్ట్ ఫింగర్ పాస్ట్ ఎపిసోడ్‌లోనే నేను వెనుదిరిగా. ఈ ఏడాది మాత్రం అనుకున్నది సాధించాను. 17వ ప్రశ్నకు అంటే 7.5 కోట్ల జాక్‌పాట్‌కి చేరుకున్నాను. కానీ ఆ ప్రశ్నకు నాకు సరైన సమాధానం తెలియలేదు. ఆ ప్రశ్నకు తప్పుడు సమాధానమిచ్చి ఉంటే నాకు కేవలం రూ.75 లక్షలు మాత్రమే వచ్చేవి. అందుకే కోటి రూపాయలు తీసుకుని ఆట నుంచి బయటపడ్డాన`ని కవిత చెప్పింది. 

Updated Date - 2022-09-21T21:01:56+05:30 IST