Madhya Pradesh: ప్రియుడు తెచ్చిన విషాన్ని నీళ్లల్లో కలిపి భర్తకు ఇచ్చా.. అందుకే చనిపోయాడని ఆ భార్య చెప్పినా పోలీసులు మాత్రం..

ABN , First Publish Date - 2022-08-17T21:35:57+05:30 IST

ఆ మహిళకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. ముగ్గురు పిల్లలకు తల్లిగా మారింది..

Madhya Pradesh: ప్రియుడు తెచ్చిన విషాన్ని నీళ్లల్లో కలిపి భర్తకు ఇచ్చా.. అందుకే చనిపోయాడని ఆ భార్య చెప్పినా పోలీసులు మాత్రం..

ఆ మహిళకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. ముగ్గురు పిల్లలకు తల్లిగా మారింది.. నాలుగేళ్ల క్రితం వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. తరచుగా అతడిని కలిసేది.. భర్త అడ్డుపడుతున్నాడనే కారణంతో అతడిని అంతమొందించాలనుకుంది.. ప్రియుడు తెచ్చిన విషాన్ని మంచి నీళ్లలో కలిపి భర్త చేత తాగించి హత్య చేసింది.. చివరకు ఊరు అందరి ముందు తన తప్పును అంగీకరించింది.. అయినా పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేయలేదు.. దీంతో మృతుడి తండ్రి జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. 


ఇది కూడా చదవండి..

Half Body Girl: 15 ఏళ్ల క్రితం నడుము వరకే దేహంతో పుట్టిన ఓ బాలిక.. ఇప్పుడు వార్తల్లో నిలవడం వెనుక..


మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని మొరెనాకు చెందిన రాజేష్‌ అనే వ్యక్తిని సీమా అనే మహిళ 2009లో వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం దిశంత్ అనే వ్యక్తితో సీమ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం చుట్టు పక్కల వారందరికీ తెలుసు. ఇటీవల సీమ, ఆమె ప్రియుడు దిశంత్ కలిసి రాజేష్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. గత నెల 21న దిశంత్ తెచ్చిన విషాన్ని మంచి నీటిలో కలిపి భర్త చేత సీమ తాగించింది. కొద్ది సేపటి తర్వాత రాజేష్ నోటి నుంచి నురగ రావడం మొదలైంది. చుట్టుపక్కల వారు, రాజేష్ తండ్రి, సోదరుడు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ రాజేష్ చికిత్స పొందుతూ మరణించాడు. 


ఏం జరిగిందని గ్రామ పంచాయితీ పెద్దలు గట్టిగా అడిగేసరికి సీమ నిజం అంగీకరించింది. దిశంత్, తాను విషం పెట్టి తన భర్తను చంపేసినట్టు అంగీకరించింది. ఆ విషయం స్టాంప్ పేపర్‌పై రాసి గ్రామ పెద్దల ఎదుట సంతకం పెట్టింది. దీంతో రాజేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అయితే నెల రోజులు గడుస్తున్నా సీమను మాత్రం పోలీసులు అరెస్ట్ చేయలేదు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చే వరకు సీమను నిందితురాలిగా భావించకూడదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. దీంతో రాజేష్ తండ్రి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. 

Updated Date - 2022-08-17T21:35:57+05:30 IST