అంటార్కిటిక్ ప్రాంతంలో కురిసిన మంచును చూసి అవాక్కైన పరిశోధకులు.. కారణమేంటో తెలిస్తే భయం ఖాయం!

ABN , First Publish Date - 2022-06-09T21:59:00+05:30 IST

ప్రస్తుతం భూగ్రహానికి అత్యంత ప్రమాదకరంగా మారిన అంశం.. ప్లాస్టిక్. ఎన్నో ఏళ్లుగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరగడంతో నీరు, గాలి అంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది.

అంటార్కిటిక్ ప్రాంతంలో కురిసిన మంచును చూసి అవాక్కైన పరిశోధకులు.. కారణమేంటో తెలిస్తే భయం ఖాయం!

ప్రస్తుతం భూగ్రహానికి అత్యంత ప్రమాదకరంగా మారిన అంశం.. ప్లాస్టిక్. ఎన్నో ఏళ్లుగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరగడంతో నీరు, గాలి అంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. పర్యావరణానికి, మానవాళి మనుగడకు ప్లాస్టిక్ పెను ముప్పుగా పరిణమించింది. మనచుట్టూ కంటికి కనిపించని సూక్ష్మ స్థాయిలో ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయి. కానీ, మానవాళి సంచారం పెద్దగా ఉండని అంటార్కిటిక్ ప్రాంతంలో కూడా ప్లాస్టిక్ బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. 


ఇది కూడా చదవండి..

భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక.. మూడేళ్లుగా కొండని తవ్వుతున్న భర్త.. చచ్చేలోపు సాధిస్తానంటూ..


అంటార్కిటిక్ ప్రాంతంలో కొత్తగా కురిసిన మంచులో కూడా సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు బయటపడ్డాయని న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. నిజానికి అంటార్కిటిక్ ప్రాంతంలోని మంచులోనూ, ఉపరితల జలంలోనూ ప్లాస్టిక్‌ను గతంలోనే గుర్తించారు. అయితే కొత్తగా కురిసిన మంచులోనూ ప్లాస్టిక్ రేణువులు బయట పడటం ఇదే తొలిసారి. బియ్యం గింజల పరిమాణం కంటె తక్కువ స్థాయిలో ఉన్న ప్లాస్టిక్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్లాస్టిక్ వల్ల మంచు కరిగే వేగం బాగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంత నగరాలకు ముంపు ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. 


న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కాంటర్బరీకి చెందిన అలెక్స్‌ అవెస్‌ అనే పీహెచ్‌డీ విద్యార్థిని 2019లో అంటార్కిటిక్‌లోని రాస్‌ ఐస్‌ షెల్ఫ్‌ నుంచి మంచు నమూనాలు సేకరించారు. ఆమె సేకరించిన 19 నమూనాలలోనూ ప్లాస్టిక్‌ ఆనవాళ్లున్నాయి. నిజానికి రాస్‌ ఐస్‌ షెల్ఫ్‌లో మానవ సంచారమే ఉండదు. అయినా, అక్కడి నుంచి సేకరించిన ప్రతి లీటర్‌ మంచులో సగటున 29 మైక్రోప్లాస్టిక్‌ రేణువులున్నట్లు తేలింది. ప్లాస్టిక్‌ రేణువులు గాలి ద్వారా వేల కిలోమీటర్లు సులువుగా ప్రయాణిస్తాయని, పర్యాటకుల ద్వారానే ప్లాస్టిక్‌ అంటార్కిటిక్‌ వరకు చేరి ఉంటుందని పరిశోధకు భావిస్తున్నారు. `ఈ భూమి మీద అత్యంత ఎత్తైన ప్రాంతమైన ఎవరెస్ట్ నుంచి అత్యంతో లోతైన సముద్రాల వరకు ప్లాస్టిక్ విస్తరించింది. మనుషులు తీసుకుంటున్న ఆహారంలోనూ, పీలుస్తున్న గాలిలోనూ మైక్రో ప్లాస్టిక్స్  ఉన్నాయ`ని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-09T21:59:00+05:30 IST