ఓ నిరుపేద కూలీకి సడన్‌గా లగ్జరీ లైఫ్.. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-08-29T01:04:12+05:30 IST

అతడు ఓ నిరుపేద కూలీ.. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.. ఉన్నట్టుండి ఒక్కసారిగా అతడి ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది.

ఓ నిరుపేద కూలీకి సడన్‌గా లగ్జరీ లైఫ్.. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

అతడు ఓ నిరుపేద కూలీ.. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.. ఉన్నట్టుండి ఒక్కసారిగా అతడి ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది.. తనకున్న అప్పులన్నీ తీర్చేశాడు.. స్నేహితులకు పార్టీలు ఇచ్చేవాడు.. అలాగే జీవన శైలిలో కూడా మార్పు వచ్చింది.. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.. పోలీసులకు ఆ విషయం తెలియడంతో వారు మొత్తం కూపీ లాగారు.. ఓ పాత గోడలో దొరికిన నిధి వల్ల అతడు హఠాత్తుగా ధనవంతుడిగా మారిపోయాడని తేల్చారు.


ఇది కూడా చదవండి..

Shocking: బాత్రూంలో ఇరుక్కుపోయిన మహిళ.. ప్రాణభయంతో గోడలపై లిప్‌స్టిక్‌తో చివరి మెసేజ్.. మూడు రోజుల తర్వాత..


మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని ధార్ జిల్లా గుష్ ప్రాంతానికి చెందిన శివనారాయణ రాథోడ్ అనే వ్యక్తికి చెందిన పాత ఇంటి గోడను కూల్చేందుకు ఎనిమిది మంది కూలీలు నెల రోజుల క్రితం వెళ్లారు. ఆ పాత గోడలో వారికి కోటి రూపాయలకు పైగా విలువైన నగలు, 87 బంగారు నాణేలు లభించాయి. ఆ కూలీలు ఆ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పకుండా మొత్తం బంగారాన్ని తమలో తాము పంచేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సురేష్ అనే కూలీ కొంత బంగారాన్ని అమ్మి జల్సాగా జీవించడం ప్రారంభించాడు. హఠాత్తుగా అతడి జీవన శైలిలో మార్పులు రావడంతో చుట్టుపక్కల వాళ్లు ఆరా తీశారు. అతడికి నిధి దొరికినట్టు బయటపడింది. 


ఆ విషయం పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సురేష్‌ను అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించారు. దీంతో సురేష్ మొత్తం విషయం బయటపెట్టాడు. మిగిలిన ఏడుగురు కూలీల పేర్లనూ వెల్లడించాడు. కూలీల నుంచి బంగారాన్ని, నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2022-08-29T01:04:12+05:30 IST