నాకు అమ్మాయిలంటేనే ఇష్టం.. చెప్పుకోవడానికి నేనేమీ సిగ్గు పడటం లేదు.. అవమానాలను ఎదుర్కొని నిలిచిన యువతి కథ ఇదీ..!

ABN , First Publish Date - 2022-09-07T23:11:12+05:30 IST

లెస్బియన్ అని తొలిసారి తండ్రికి చెప్పినపుడు ఆయన స్పందించిన తీరు గురించి అంకిత మెహ్రా అనే యువతి వెల్లడించింది.

నాకు అమ్మాయిలంటేనే ఇష్టం.. చెప్పుకోవడానికి నేనేమీ సిగ్గు పడటం లేదు.. అవమానాలను ఎదుర్కొని నిలిచిన యువతి కథ ఇదీ..!

`నాలుగేళ్ల కిందట ముంబైలోని ఓ టీ స్టాల్‌కి మా నాన్నను పిలిచాను. ఆయనకు 16 పేజీల లేఖ ఇచ్చాను. మా నాన్న టీ తాగుతూ పేజీలు తిప్పడం మొదలుపెట్టాడు. కొన్ని పేజీలు చదివాక ఏడవడం మొదలుపెట్టాడు. నన్ను, ఆ లేఖను మార్చి మార్చి చూశాడు. పూర్తిగా చదివాక చాలా సేపు సైలెంట్‌గా ఉండిపోయాడు. ఆ తర్వాత లేచి నన్ను పట్టుకుని.. ``నువ్వు ఎలా ఉన్నా నా కూతురివే. నీకు నచ్చింది చెయ్యి` అని చెప్పాడు`.. తాను లెస్బియన్ అని తొలిసారి తండ్రికి చెప్పినపుడు ఆయన స్పందించిన తీరు గురించి అంకిత మెహ్రా అనే యువతి వెల్లడించింది. 


ఇది కూడా చదవండి..

దారుణం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను బంధించిన యాజమాన్యం.. ఆహారం తినకుండా నిర్బంధం.. చివరకు..


రాజస్థాన్‌ (Rajasthan)లోని జోధ్‌పూర్‌కు చెందిన అంకితా మెహ్రా తాను LGBT కమ్యూనిటీకి చెందిన యువతినని పేర్కొంటూ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఆరేళ్లుగా పనిచేస్తోంది. తన కమ్యూనిటీ గురించి, తన లాంటి యువతుల గురించి ఆమె ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఇప్పటికి 300కు పైగా ప్రసంగాలు ఇచ్చింది. `14 ఏళ్ల వయసులో నాకు సమస్యలు ప్రారంభమయ్యాయి. మొదటిసారి కాలేజీకి వెళ్లినపుడు అబ్బాయిలు, అమ్మాయిలు నా వైపు వింత చూడడం ఇంకా గుర్తింది. అందరూ నన్ను విచిత్రంగా చూడడాన్ని తట్టుకోలేకపోయా. అవును.. నాకు అబ్బాయిలంటే ఆసక్తి ఉండదు. అమ్మాయిలంటేనే ఇష్టం. దానికి ఎవరిని తప్పు పట్టాలో నాకు తెలియడం లేదు. నా గురించి చెప్పుకోవడానికి నేను సిగ్గపడను. 


నన్ను అందరూ అవహేళన చేస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ, నాలాంటి యువతులు చాలా మంది ఉన్నారు. వారికి బాసటగా నిలిచేందుకు బతకాలనుకున్నా. వారికి అండగా ఉండదలచుకున్నా. జెండర్ న్యూట్రల్ గురించి అందరిలోనూ అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నా. విమానాశ్రయాలు, మాల్స్‌తో సహా అనేక బహిరంగ ప్రదేశాలలో జెండర్ న్యూట్రల్ వాష్‌రూమ్‌ల కోసం ప్రచారం చేస్తున్నాను. నా లైంగికత నా గుర్తింపు కాదు. ఈ రోజు బాధితురాలిని కాదు.. మార్పు కోసం ప్రయత్నిస్తున్న యువతిన`ని అంకిత పేర్కొంది. 

Updated Date - 2022-09-07T23:11:12+05:30 IST