ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా కామెడీ, స్ఫూర్తివంతమైన వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. వాటికి ఆయన జత చేసే కామెంట్లు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా ఆయన ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో, దానికి ఆయన జత చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆయన షేర్ చేసిన వీడియోలో.. ఒక వ్యక్తి పొడవైన పెనంపై భారీ రుమాలీ రోటీలను తయారు చేస్తున్నాడు. అత్యంత లాఘవంగా అతను భారీ సైజులో రుమాలీ రోటీలను ఒత్తి, పెనంపై కాల్చుతున్నాడు. ఆ వీడియోను హర్ష్ ట్విటర్‌లో పోస్ట్ చేసి.. `నన్ను బరువు తగ్గమని, రాత్రిపూట ఒక్క రోటీ మాత్రమే తినమని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు నేను ఇతని కోసం వెతుకుతున్నాన`ని కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి