Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాయామం అతిగా వద్దు

ఆంధ్రజ్యోతి(08-12-2020)

కరోనా నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధకశక్తిని మెరుగ్గా ఉంచుకోవాలి. అందుకోసం క్రమంతప్పక వ్యాయామం చేయాలి. అయితే కొందరు ఈ విషయాన్ని ఎక్కువ సీరియస్‌గా తీసుకుంటారు. అవసరానికి మించి వ్యాయామం చేస్తూ శరీరాన్ని అలసటకు లోను చేస్తూ ఉంటారు. అతిగా వ్యాయామం చేయడం వల్ల కలిగే కొన్ని నష్టాలు...


నిస్సత్తువ: అతిగా వ్యాయామం చేస్తే, శక్తి తగ్గిపోతుంది. విపరీతమైన నిస్సత్తువ ఆవరిస్తుంది. 8 గంటలకు తగ్గకుండా నిద్రపోతున్నా, పౌష్టికాహారం తీసుకుంటున్నా నిస్సత్తువ వెంటాడుతూ ఉంటుంది. ఇందుకు కారణం అవసరానికి మించి వ్యాయామం చేయడం వల్ల శరీరంలో స్ట్రెస్‌ హార్మోన్‌ విడుదల కావడమే! 


సామర్థ్యం: విపరీతంగా వ్యాయామం చేయడం వల్ల సామర్ధ్యం క్రమేపీ తగ్గుతుంది. ఒక కిలోమీటరు దూరాన్ని ఐదు నిమిషాల్లో ముగించే వారు, ఓవర్‌ ఎక్సర్‌సైజింగ్‌ కారణంగా అంతే దూరానికి పది నిమిషాల సమయం తీసుకుంటారు. సామర్థ్యం పెరగాలంటే సెషన్ల మధ్య సరిపడా విరామం పాటించాలి.


గాయాలు: కండరాలు, ఎముకలు, లిగమెంట్లు గాయాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వేధించవచ్చు. ఓవర్‌ ఎక్సర్‌సైజింగ్‌తో తలెత్తే ఈ నొప్పులు వారాల తరబడి వేధిస్తాయి. 


Advertisement
Advertisement