Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 15 Jul 2022 16:19:23 IST

వయసు మీద పడుతున్నా ఆ ఊళ్లోని అబ్బాయిలకు పెళ్లే కావడం లేదట.. అసలు సంబంధాలే రాకపోవడం వెనుక..!

twitter-iconwatsapp-iconfb-icon
వయసు మీద పడుతున్నా ఆ ఊళ్లోని అబ్బాయిలకు పెళ్లే కావడం లేదట.. అసలు సంబంధాలే రాకపోవడం వెనుక..!

ఆ గ్రామం రాష్ట్ర రాజధానికి మరీ ఎక్కువ దూరంలో కూడా లేదు. అయినా ఈ గ్రామం పేరు చెబితేనే చుట్టుపక్కల వారు భయపడతారు. ఆ గ్రామానికి వెళ్లాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఒకవేళ వెళ్లినా అక్కడి ఇళ్లల్లో పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టరు. ఇక ఈ గ్రామంలో యువకులకు అమ్మాయిలను ఇవ్వడానికి ఎవరూ ముందుకురావడం లేదు. వయసు మీద పడుతున్న చాలా మంది యువకులకు పెళ్లి సంబంధాలు రావడం లేదు. అసలు ఆ గ్రామం పేరు ఏంటి, ఎక్కడ ఉంది, వారి సమస్యకు కారణం ఏంటి.. అనే వివరాల్లోకి వెళితే..

వయసు మీద పడుతున్నా ఆ ఊళ్లోని అబ్బాయిలకు పెళ్లే కావడం లేదట.. అసలు సంబంధాలే రాకపోవడం వెనుక..!

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర రాజధానికి 230కిలోమీటర్ల దూరంలో.. ఒడిశా సరిహద్దులో ఉన్న సుపేబెడ గ్రామ ప్రజలు.. ఒకే ఒక సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామం ఛత్తీస్‌గఢ్‌లో భాగమైనప్పటికీ, అధిక వర్షాల కారణంగా స్థానికంగా ఉన్న టెల్ నది నీటిమట్టం పెరుగుతుంది. దీని వల్ల ఈ గ్రామానికి చేరుకోవాలంటే ఒడిశాలోని పారల్, ఖోక్సరపర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ గ్రామంలో ఎవరూ 45 నుంచి 50 ఏళ్ల కంటే ఎక్కువ బతకరు. దీంతో ఈ ఊరి వారికి పెద్ద దిక్కు అంటూ ఎవరూ ఉండరు. గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు లేని ఇల్లు అంటూ ఉండదు. ఇక్కడి తాగునీరు కలుషితమవ్వడంతో ఈ సమస్య తలెత్తింది. దీంతో ఈ గ్రామంలోని నీటిని తాగాలంటేనే బయటివారు భయంతో వణికిపోతుంటారు.

Viral photo: ఎద్దులపై భారం పడకుండా.. విద్యార్థుల వినూత్న ఐడియా.. అద్భుత ఆవిష్కరణ అంటూ నెటిజన్ల ప్రశంసలు..

వయసు మీద పడుతున్నా ఆ ఊళ్లోని అబ్బాయిలకు పెళ్లే కావడం లేదట.. అసలు సంబంధాలే రాకపోవడం వెనుక..!

గ్రామంలో 45నుంచి 50 ఏళ్లు వచ్చేసరికి.. కిడ్నీ ఫెయిల్ అవుతుంది. దీంతో ఈ ఊరి యువకులకు పెళ్లి సంబంధాలు కూడా రావు. గ్రామంలో గత రెండేళ్లుగా అబ్బాయిలకు సంబంధాలే రావడం లేదు. కేవలం ఎనిమిది వివాహాలు మాత్రమే జరిగాయి. ఒకవేళ ఇక్కడి వారిని పెళ్లి చేసుకున్నా.. వెంటనే గ్రామం వదిలి రావల్సిందేనని అమ్మాయి తరపు వారు కండీషన్ పెడుతుంటారు. గ్రామం, పొలాలను వదిలి వెళ్లడం ఇష్టం లేక.. పూర్వీకుల నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు. గ్రామంలో అతి పెద్ద వంశమైన క్షేత్రపాల కుటుంబీకులు 25 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరు గ్రామం వదిలి వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోసం వేచి చూస్తున్నారు. ఇక ఈ గ్రామంలో ఏ కుటుంబం గురించి విచారించినా అయ్యో! పాపం అనిపిస్తుంది.

18 ఏళ్లుగా పోరాటం.. రిటైర్మెంట్ డబ్బులకై తిరిగీ తిరిగీ విసుగొచ్చి ఆ వృద్ధుడు తీసుకున్న నిర్ణయమిదీ..!

వయసు మీద పడుతున్నా ఆ ఊళ్లోని అబ్బాయిలకు పెళ్లే కావడం లేదట.. అసలు సంబంధాలే రాకపోవడం వెనుక..!

నిఖిల్ అనే వ్యక్తికి 16 ఏళ్ల వయస్సు. ఇతడి తండ్రి ప్రదీప్ కుమార్ క్షేత్రపాల్.. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఐదేళ్ల క్రితం చనిపోయాడు. ఆయన ఉపాధ్యాయుడు. తండ్రి చనిపోయే నాటికి నిఖిల్ వయసు 11 ఏళ్లు, అతడి అక్క వయసు 13 ఏళ్లు, చెల్లెలి వయసు 9 ఏళ్లు. ఇంట్లో సంపాదించేవారు ఎవరూ లేకపోవడంతో వీరి బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. గతేడాది గవర్నర్‌ జోక్యంతో తన తల్లికి ఎన్‌ఆర్‌ఈజీఏ కార్యాలయంలో రోజువారీ కూలీ ఉద్యోగం వచ్చిందని నిఖిల్‌ చెబుతున్నాడు.

ఒకప్పుడు పొలాల్లో పశువుల కాపరి.. ప్రస్తుతం ఈ మహిళ ఏ రేంజ్‌లో ఉందో అస్సలు ఊహించలేరు.. ఒక్కో ఏడాదికి..

పూనమ్ అనే మహిళ భర్త ప్రేమ్‌జయ్.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో రోజుకు నాలుగు సార్లు డయాలసిస్ చేయాల్సి వస్తోంది. భర్త వ్యవసాయం చేస్తూ ట్రాక్టర్ నడుపుతూ సంపాదించేవాడని, చికిత్స కోసం ట్రాక్టర్‌ను విక్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈమెకు తన ఇద్దరు పిల్లలను పోషించడం భారంగా మారింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు. అలాగే గత ఐదేళ్లలో క్షేత్రపాల కుటుంబానికి చెందిన 11 మంది కిడ్నీ సమస్యతో చనిపోయారు. అందులో ఇద్దరు మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారు.

కూతుర్ని డాక్టర్‌ను చెయ్.. ఆర్మీకి మాత్రం పంపకు.. అంటూ భార్యకు చివరి వీడియో.. ఓ సైనికుడి ఆత్మహత్య కేసులో..

ఈ గ్రామంలో 55 ఏళ్ల భూమిసుత ఒక్కరే అత్యంత వృద్ధురాలు. ఈమె తన ఇద్దరు కుమారులను కోల్పోయింది. ప్రస్తుతం ఆ ఊరి ప్రజలు తమ రోగాన్ని దాచుకుంటున్నారని తెలిసింది. వ్యాధి బయటపడితే అధికారులు విచారణకు వస్తారని, తద్వారా వివాహాలు కావడం కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో 35 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వీరిలో ఇద్దరు ఇప్పటికీ డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. గ్రామంలో ఇప్పటికీ చేతి పంపు నీటిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. వీటిలో రెండు PHE డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినవి కాగా, చాలా వరకు ప్రైవేట్‌గా వేసిన బోర్లే ఉన్నాయి.

Viral Video: ఒక్కసారిగా వరద రావడంతో.. నదిలో ఏనుగుతో సహా మునిగిన మావటి.. చివరికి ఏమైందో మీరే చూడండి..

ప్రభుత్వం ఈ గ్రామ ప్రజలను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పర్యటనకు పంపింది. ఈ జిల్లాలోని రెండు గ్రామాల్లో కూడా ఇదే సమస్య ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ డయాలసిస్‌ రోగులకు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ప్రతి నెలా రూ.15 వేలు అందజేస్తోంది. దీంతో సుపేబెడ గ్రామ ప్రజలు కూడా.. తమకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.

robbery: సంచి నిండా cash ఉందనుకుని.. బెదిరించి మరీ లాక్కెళ్లారు.. బాధితుడు చెప్పింది విని అవాక్కయిన పోలీసులు..


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.