Viral Video: ఒక్కసారిగా వరద రావడంతో.. నదిలో ఏనుగుతో సహా మునిగిన మావటి.. చివరికి ఏమైందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-07-14T02:43:32+05:30 IST

ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు.. పొంగి పొర్లుతున్నాయి. తప్పనిసరి అయితేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని..

Viral Video: ఒక్కసారిగా వరద రావడంతో.. నదిలో ఏనుగుతో సహా మునిగిన మావటి.. చివరికి ఏమైందో మీరే చూడండి..

ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు.. పొంగి పొర్లుతున్నాయి. తప్పనిసరి అయితేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఏనుగుతో సహా వరద నీటిలో చిక్కుకుంటాడు. అయితే అదృష్టవశాత్తు మావటితో సహా ఏనుగు ఎలాగోలా ఒడ్డుకు చేరుతుంది.


బీహార్‌లోని వైశాలి పరిధి రాఘోపూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాఘోపూర్‌ పరిధిలోని గంగానదిలో వరద పొటెత్తింది. ఆ సమయంలో ఓ మావటి తన ఏనుగుతో సహా నదిని దాటుతున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ఏనుగు అందులో మునిగిపోతుంది. అయినా ఏనుగు మాత్రం వరదను ఏమాత్రం లెక్కచేయకుండా సుమారు కిలోమీటర్ మేర ఈదుతుంది. ఒకానొక ధశలో ఏనుగు, మావటి మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఏనుగు ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతుంది. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏనుగును నదిని దాటించేందుకు పెద్ద పడవ అవసరం వచ్చింది. అయితే అంత డబ్బు మావటి వద్ద లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral photo: ఆ పార్కులో ఇలాంటి పనులు అస్సలు చేయొద్దట.. బోర్డు చూసి అవాక్కవుతున్న సందర్శకులు..





Updated Date - 2022-07-14T02:43:32+05:30 IST