Chicago: విమానం మిస్ చేసుకున్న మహిళ.. కన్నింగ్‌ ఐడియాతో అధికారులకు చుక్కలు!

ABN , First Publish Date - 2021-09-08T21:43:19+05:30 IST

తాను ఎక్కాల్సిన విమానం మిస్ కావడంతో చికాగో‌కు చెందిన ఓ మహిళ చేసిన పని.. కొద్దిసేపు ఎయిర్‌పోర్టు అధికారులను పరుగులు పెట్టించింది.

Chicago: విమానం మిస్ చేసుకున్న మహిళ.. కన్నింగ్‌ ఐడియాతో అధికారులకు చుక్కలు!

ఫోర్ట్ లాడర్డేల్, ఫ్లోరిడా: తాను ఎక్కాల్సిన విమానం మిస్ కావడంతో చికాగో‌కు చెందిన ఓ మహిళ చేసిన పని.. కొద్దిసేపు ఎయిర్‌పోర్టు అధికారులను పరుగులు పెట్టించింది. తాను వెళ్లాల్సిన విమానం మిస్ చేసుకున్న సదరు మహిళ ఎలాగైనా ఆ విమానం ఎక్కాలనుకుంది. అంతే.. వెనుకముందు ఆలోచించకుండా తాను మిస్ చేసుకున్న ఆ విమానంలో బాంబు ఉందని అధికారులతో అబద్ధం చెప్పింది. దాంతో అప్పటికే రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానాన్ని అధికారులు ఆపేశారు. తనిఖీ చేయగా అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. అనంతరం ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పింది. 


అసలేం జరిగిందంటే.. అమెరికాలోని చికాగోకు చెందిన మెరీనా వెర్బిట్స్కీ(46) అనే మహిళ సోమవారం రాత్రి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వేరే చోటుకు వెళ్లేందుకు విమానం ఎక్కాల్సి ఉంది. కానీ, ఆమె ఎయిర్‌పోర్టుకు చేరుకునే సరికి ఆలస్యమైంది. అప్పటికే విమానం టేకాఫ్‌కు రెడీగా ఉంది. ఇక తనకు విమానం ఎక్కేందుకు అధికారులు అనుమతించరని భావించిన మెరీనా.. ఓ కన్నింగ్ ఐడియా చేసింది. ఆ విమానంలో బాంబు ఉందని, తనకు పక్కా సమాచారం ఉందని అధికారులతో అబద్ధం చెప్పింది.

ఇవి కూడా చదవండి..

Saudi నుంచి వచ్చిన విమానం.. ఓ ప్రయాణికుడిని కారులో వెంబడించిన పోలీసులు.. క్రైమ్ సినిమా స్టోరీ తరహాలో..

New York అపార్ట్‌మెంట్‌లో అద్దాల్లోంచి ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఈ సెలబ్రెటీ కూతురు ఎవరో ఊహించగలరా..? 


అంతే.. ఆమె మాటలతో హాడలెత్తిపోయిన అధికారులు వెంటనే టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఆ విమానాన్ని నిలిపేశారు. ప్రయాణికులను కిందకు దించి.. విమానం మొత్తాన్ని బాంబు స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. కానీ, ఆ సోదాల్లో ఎక్కడ వారికి విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. దాంతో మెరీనాను అదపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది. తాను విమానం మిస్ కావడంతో ఇలా అబద్ధం చెప్పినట్లు తాపీగా తెలిపింది. దాంతో ఎయిర్‌పోర్టు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి నెట్టారు.   



Updated Date - 2021-09-08T21:43:19+05:30 IST