IRCTC: రైల్వే స్టేషన్‌లో టాయిలెట్ ఉపయోగించుకున్న బ్రిటీషర్లకు షాక్.. బిల్లు ఎంతైందో తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం!

ABN , First Publish Date - 2022-09-04T02:52:39+05:30 IST

రైళ్లు, బస్సుల్లో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు, ఏదో ఒక సమయంలో, రూ. 5 లేదా 10 చెల్లించి రైల్వే స్టేషన్లు

IRCTC: రైల్వే స్టేషన్‌లో టాయిలెట్ ఉపయోగించుకున్న బ్రిటీషర్లకు షాక్.. బిల్లు ఎంతైందో తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం!

రైళ్లు, బస్సుల్లో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు, ఏదో ఒక సమయంలో, రూ. 5 లేదా 10 చెల్లించి రైల్వే స్టేషన్లు లేదా బస్ స్టేషన్లలో ఉండే పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగిస్తుంటారు. అయితే తాజాగా ఇద్దరు బ్రిటీషర్లు ఐదు నిమిషాల పాటు రైల్వే స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ను ఉపయోగించుకున్నందుకు భారీ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. ఆ ఇద్దరి నుంచి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఏకంగా రూ. 224 వసూలు చేసింది. దీంతో వారు షాకయ్యారు. 


ఇది కూడా చదవండి..

Viral: బంగ్లా యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తమిళ మహిళ.. తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి జరగడంతో..!


బ్రిటీష్ ఎంబసీకి చెందిన ఇద్దరు విదేశీయులు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ నుంచి  ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్‌లో దిగారు. వారికి గైడ్ శ్రీ వాస్తవ స్వాగతం పలికాడు. వారిద్దరిని స్టేషన్‌లో ఉన్న ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లోని వాష్‌రూంకు తీసుకువెళ్లాడు. 5 నిమిషాల తర్వాత ఆ బ్రిటీషర్లిద్దరూ బయటకు వ‌చ్చారు. ఆ వాష్ రూంను ఉపయోగించుకున్నందుకు రూ. 224 చెల్లించాలని రిసెప్షనిస్టు బిల్లు చేతిలో పెట్టింది. దీంతో వారిద్దరూ షాకయ్యారు. ఆ బిల్లు ప్రకారం.. ఒక్కరు వాష్ రూం వినియోగించుకున్నందుకు చెల్లించాల్సింది-రూ. 100, దానిపై జీఎస్టీ రూ. 12. అలా ఇద్దరికీ క‌లిపి రూ. 224 బిల్లు అయ్యింద‌ని రిసెప్షనిస్ట్‌ సమాధానమిచ్చింది. ఆ బిల్లులపై విదేశీయులతో పాటు గైడ్‌కూడా అభ్యంత‌రం వ్యక్తం చేశాడు. 


అయినా చేసేదేం లేక ఆ మొత్తం చెల్లించి బయటపడ్డారు. `జనరల్ కోచ్‌లో ఆగ్రా నుంచి ఢిల్లీకి టికెట్‌ రూ. 90 మాత్రమే. కానీ, వాష్‌రూం వాడుకున్నందుకు మాత్రం రూ.112 వసూలు చేస్తున్నార`ని గైడ్‌ పేర్కొన్నాడు. కాగా, ఈ ఈ బిల్లుపై ఐఆర్‌సీటీసీ ప్రతినిథి స్పందించారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఎంట్రీకి ప్రత్యేక రుసుం ఉంటుందని, దానిపై జీఎస్టీ కూడా చెల్లించాలని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ లోప‌ల టాయిలెట్‌తోపాటు ఇంటర్నెట్‌ సౌకర్యం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇక, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఐదు నిమిషాలున్నా, గంట‌సేపు ఉన్నా అదే రుసుం వ‌ర్తిస్తుంద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.


Updated Date - 2022-09-04T02:52:39+05:30 IST