Viral: బంగ్లా యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తమిళ మహిళ.. తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి జరగడంతో..!

ABN , First Publish Date - 2022-09-04T01:07:06+05:30 IST

ఇటీవలి కాలంలో స్వలింగ వివాహాల గురించి తరచుగా వింటున్నాం. కొన్ని దేశాల్లో స్వలింగ వివాహాలు సాధారణమే అయినా

Viral: బంగ్లా యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న  తమిళ మహిళ.. తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి జరగడంతో..!

ఇటీవలి కాలంలో స్వలింగ వివాహాల గురించి తరచుగా వింటున్నాం. కొన్ని దేశాల్లో స్వలింగ వివాహాలు సాధారణమే అయినా మన దేశంలో మాత్రం ఈ ట్రెండ్ ఇటీవలే మొదలైంది. తాజాగా చెన్నైలో ఇద్దరు యువతులు వివాహం చేసుకున్నారు. ఆ ఇద్దరూ సాంప్రదాయ హిందూ కుటుంబాలకు చెందినవారు. అంతేకాదు ఆ వివాహానికి ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు అంగీకరించారు. వారి సమక్షంలోనే ఆ అమ్మాయిలు వివాహం చేసుకున్నారు. 


సాధారణంగా ఇలాంటి వివాహాలను తల్లిదండ్రులు ఆమోదించరు. కానీ, ఈ వివాహం మాత్రం వారి సమ్మతితోనే జరగడం విశేషం. తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుభిక్ష సుబ్రమణి, బంగ్లాదేశ్‌కు చెందిన టీనా దాస్ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 29 ఏళ్ల సుభిక్ష డెలాయిట్‌లో ఛార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తోంది. 19 ఏళ్ల వయసులోనే తాను బై-సెక్సువల్ అని సుభిక్ష గుర్తించింది. ఆమె బాల్యం అంతా మధురైలో గడిచింది. ఆ తర్వాత కెనడా వెళ్లింది. అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెకు LGBT కమ్యూనిటీ గురించి తెలిసింది. ఇక, 35 ఏళ్ల టీనా దాస్‌ ప్రవర్తనలో తేడాను గుర్తించిన తల్లిదండ్రులు ఆమెకు 19 ఏళ్ల వయసులో ఓ వ్యక్తితో వివాహం చేశారు. నాలుగేళ్ల తర్వాత అతనికి టీనా విడాకులు ఇచ్చేసి కెనడా వెళ్లింది. 


కెనడాలోని కల్గారిలో సుభిక్షకు టీనా పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. తమ అభిరుచులు ఒకటేనని తెలుసుకుని ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. ఇద్దరూ నాలుగేళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దాదాపు రెండేళ్లు కష్టపడి తమ తమ కుటుంబ సభ్యులను ఒప్పించారు. తాజాగా చెన్నైలో సాంప్రదాయ హిందూ పద్ధతిలో వీరి వివాహం జరిగింది.  

Updated Date - 2022-09-04T01:07:06+05:30 IST