Viral Video: ఈ యువతి.. పెళ్లి వేదికపై, అందరి ముందు.. ఏమాత్రం బిడియం లేకుండా..

ABN , First Publish Date - 2022-08-01T02:14:49+05:30 IST

వివాహ సమయాల్లో కొన్నిసార్లు ఫన్నీ ఫన్నీ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పెళ్లిళ్ల సమయంలో చాలా మంది వధువులు సాధారణంగా సిగ్గు, బిడియంతో ఉంటారు. అయితే కొందరు..

Viral Video: ఈ యువతి.. పెళ్లి వేదికపై, అందరి ముందు.. ఏమాత్రం బిడియం లేకుండా..

వివాహ సమయాల్లో కొన్నిసార్లు ఫన్నీ ఫన్నీ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పెళ్లిళ్ల సమయంలో చాలా మంది వధువులు సాధారణంగా సిగ్గు, బిడియంతో ఉంటారు. అయితే కొందరు వధువులు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉత్సాహంగా కనిపిస్తారు. మరికొందరైతే ఒకడుగు ముందుకేసి వరుడితో కలిసి కాలు కదుపుతూ ఉంటారు. ఇలాంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) లో వైరల్ (Viral) అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే.. 


వివాహ వేదికపై బంధువులు, సన్నిహితుల ఎదుట వధూవరులు దండలు మార్చుకుంటుంటారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడి పరిస్థితి ఒక్కసారిగా మరింత ఉత్సాహంగా మారుతుంది. అక్కడే ఉన్న కొందరు.. బాలీవుడ్ నటులు గోవిందా (Govinda), కరిష్మా కపూర్ (Karisma Kapoor) నటించిన ఖుద్దర్‌ సినిమాలోని (Bollywood movies) ‘తుమ్సా కోయి ప్యారా’ పాట (song) ను ప్లే చేస్తారు. వధూవురుల (bride and groom) ను డ్యాన్స్ వేయాల్సిందిగా అంతా డిమాండ్ చేస్తారు. వరుడు అందుకు సిద్ధమవగా.. తగ్గేదేలే.. అంటూ వధువు కూడా కాలు కదుపుతుంది. ఏమాత్రం బిడియం లేకుండా ఆమె వేసిన స్టెప్పులు.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వధూవరులంటే ఇలా  ఉండాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: రియల్ హీరో అంటే ఇతనే.. కుటుంబ పోషణ కోసం ఇతడు పడుతున్న కష్టానికి.. సెల్యూట్ కొట్టాల్సిందే..





Updated Date - 2022-08-01T02:14:49+05:30 IST