ప్రతీకాత్మక చిత్రం
నేటి సమాజంలో చాలా మంది మనుషులు.. పశువుల కంటే హీనంగా ప్రవరిస్తుంటారు. వరుస, వయసు అనే భేదాలు చూసుకోకుండా మహిళలపై తమ శాడిజాన్ని చూపిస్తుంటారు. ఇంకొందరు ప్రబుద్ధులైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్లో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మామ పిలవడంతో 15ఏళ్ల బాలిక (girl).. అతడి ఇంటికి వెళ్లింది. పక్కన కూర్చోబెట్టుకుని ప్రేమగా మాట్లాడుతూ చివరకు ఇలాంటి నీచమైన పని చేస్తాడని ఎవరూ ఊహించలేదు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం జైపూర్లోని హథోజ్ కల్వార్ ప్రాంతంలో 15ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. అదే ప్రాంతంలోని ఓ వ్యక్తి ఈమెకు వరుసకు మామ అవుతాడు. బంధువు కావడంతో అతడితో సన్నిహితంగా ఉండేది. కానీ అతను మాత్రం బాలికను వక్రదృష్టితో చూసేవాడు. అతడి క్రూరమైన మనస్థత్వాన్ని గమనించిన బాలిక.. రోజూ అతడితో సరదాగా మాట్లాడుతూ ఉండేది. అవకాశం కోసం వేచి చూస్తున్న అతడు.. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను తన ఇంటికి పిలిచాడు. అక్కడికి వెళ్లిన బాలికను తన పక్కన కూర్చోబెట్టుకుని ప్రేమగా మాట్లాడాడు.
కాసేపటి తర్వాత.. తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. ఒక్కసారిగా అతడి ప్రవర్తనలో మార్పు రావడంతో బాలిక షాక్ అయింది. నన్ను వదులు అని వేడుకుంటున్నా.. వినకుండా ఆమెను బలవంతం చేయసాగాడు. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటికి పరుగెత్తుకుంటూ వెళ్లింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి