American Woman pregnancy: వరుసగా 16 ఏళ్లు గర్భంతోనే ఉంది.. 12మంది పిల్లలకు తల్లి అయింది.. అయినా ఇంకా..

ABN , First Publish Date - 2022-07-31T20:43:16+05:30 IST

తల్లి కావడం ప్రతి మహిళ జీవితంలోనూ ఓ కీలక ఘట్టం.. గర్భం దాల్చిన తర్వాత, డెలివరీ అయ్యాక స్త్రీ శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.

American Woman pregnancy: వరుసగా 16 ఏళ్లు గర్భంతోనే ఉంది.. 12మంది పిల్లలకు తల్లి అయింది.. అయినా ఇంకా..

తల్లి కావడం ప్రతి మహిళ జీవితంలోనూ ఓ కీలక ఘట్టం.. గర్భం దాల్చిన తర్వాత, డెలివరీ అయ్యాక స్త్రీ శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.. ఇక, పిల్లలను చూసుకునే విషయంలో ఒక మహిళ ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది.. అందుకే ఇప్పటి మహిళలు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అనుకుంటున్నారు.. అయితే అమెరికా (AMERICA)కు చెందిన ఓ మహిళ మాత్రం ఇప్పటికి వరుసగా 16 సార్లు గర్భవతి అయింది.. 12 మందికి జన్మనిచ్చింది.. అయినా ఆమె ఇంకా పిల్లలు కావాలని కోరుకుంటోంది. 


ఇది కూడా చదవండి..

Viral video: పెళ్లి వేదికపై వరుడితో మరదలి సరసం.. షాకైన వధువు, బంధువులు!


కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఐరిస్ పర్నెల్ (38) అనే మహిళ వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్. ఆమె వరుసగా 16 ఏళ్లు గర్భం దాల్చింది. 2004 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం గర్భవతి అయింది. 12 మంది పిల్లలకు జన్మనిచ్చింది. మళ్లీ గర్భం దాల్చకుండా ఉండేందుకు ఐరిస్ 2019లో సర్జరీ చేయించుకుంది. అలా చేయించుకున్నందుకు ఆమె చాలా బాధపడుతోంది. ఐరిస్ ప్రస్తుతం తన భాగస్వామి కోర్డెల్‌తో కలిసి నివసిస్తోంది. 


ప్రెగ్నెన్సీ, పిల్లల పెంపకం వల్ల తాను ఎన్నో నేర్చుకున్నానని ఐరిస్ నమ్ముతోంది. సహనంగా ఉండటం నేర్చుకున్నట్లు తెలిపింది. తాను మళ్లీ గర్భవతి కావాలనుకుంటున్నానని, ప్రెగ్నెన్సీ పీరియడ్‌ను చాలా మిస్ అవుతున్నానని ఐరిస్ చెప్పింది. ఐరిస్‌కు యూట్యూబ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా ఫాలోయింగ్ ఉంది.  

Updated Date - 2022-07-31T20:43:16+05:30 IST