Viral video: పెళ్లి వేదికపై వరుడితో మరదలి సరసం.. షాకైన వధువు, బంధువులు!

ABN , First Publish Date - 2022-07-30T23:19:23+05:30 IST

పెళ్లి వేడుకలంటే ఉత్సాహం, సంతోషంతో సందడిగా జరుగుతుంటాయి.

Viral video: పెళ్లి వేదికపై వరుడితో మరదలి సరసం.. షాకైన వధువు, బంధువులు!

పెళ్లి వేడుకలంటే ఉత్సాహం, సంతోషంతో సందడిగా జరుగుతుంటాయి. బంధుమిత్రులు చేసే హడావుడికి అంతు ఉండదు. పెళ్లి వేడుకల్లో (Funny Wedding Video) జరిగే ఆసక్తికర సంఘటనలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్నాయి. అలాంటి ఘటనలు అందరినీ ఎంతగానో అలరిస్తుంటాయి.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) వధువు సోదరి అనుకోకుండా చేసిన పని అందరినీ షాక్‌కు గురి చేసింది. 


ఆ వీడియో ప్రకారం.. వధూవరులు రిసెప్షన్ వేడుకలో కూర్చుని ఉన్నారు. అంతలో వధువు సోదరి వరుడికి స్వీట్ తినిపించేందుకు వేదిక పైకి వచ్చింది. పెళ్లికొడుకును టీజ్‌ చేద్దామని భావించిన ఆ యువతి.. నోటికి స్వీట్‌ అందించినట్టుగా అందించి వెనక్కి లాగేసుకుంది. అలా రెండు సార్లు చేసింది. దీంతో ఆ వరుడు ఇక లాభం లేదని, ఆ అమ్మాయి చేయిపట్టుకుని స్వీట్‌ తినేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఆ యువతి కూడా స్వీట్ తినేసేందుకు ముందుకు వెళ్లింది. దాంతో అక్కడ ఊహించని ఘటన జరిగింది. అనుకోకుండా వరుడుకి ఆమె ముద్దు (Bride`s sister kisses groom) పెట్టేసింది. అది చూసి అక్కడున్నవారంతా అవాక్కైపోయారు. వధువు కూడా షాకైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-07-30T23:19:23+05:30 IST