బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి.. నేరుగా ఇంటికి వెళ్లి తాత మొబైల్ పరిశీలించగా.. షాకింగ్ దృశ్యాలు..

ABN , First Publish Date - 2022-10-14T00:54:35+05:30 IST

అన్న, తమ్ముడు, తండ్రి, తాత.. అనే బంధాలకు కొందరి వల్ల అర్థాలే మారిపోతున్నాయి. బాలికలు, యువతులు.. వయసుతో సబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అటు ఇంట్లో, ఇటు..

బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి.. నేరుగా ఇంటికి వెళ్లి తాత మొబైల్ పరిశీలించగా.. షాకింగ్ దృశ్యాలు..
ప్రతీకాత్మక చిత్రం

అన్న, తమ్ముడు, తండ్రి, తాత.. అనే బంధాలకు కొందరి వల్ల అర్థాలే మారిపోతున్నాయి. బాలికలు, యువతులు.. వయసుతో సబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అటు ఇంట్లో, ఇటు బయట.. వేధింపులకు గురవుతున్నారు. కొందరు దుర్మార్గుల వల్ల ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీని పరిస్థితి నెలకొంది. బీహార్‌లో ఓ బాలిక విషయంలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో బాలికకు వైద్యం చేసిన అనంతరం.. పోలీసులు నేరుగా తాత ఇంటికి వెళ్లారు. చివరకు అతడి ఫోన్‌ను పరిశీలించగా షాకింగ్ వీడియోలు బయటపడ్డాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బీహార్ (Bihar) పాట్నా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన బాలిక అక్టోబర్ 7న.. కోచింగ్ తీసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లింది. మార్గమధ్యలో బాలిక తాత, మరో వ్యక్తి తారసపడ్డారు. అంతకుముందే బాలికపై కన్నేసిన తాత.. అదును కోసం వేచి చూస్తూ ఉండేవాడు. సమయం రావడంతో బాలికను తనతో రమ్మని పిలిచాడు. తాతే కావడంతో వెనుకే వెళ్లింది. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. ఒక్కసారిగా బాలికపై ఇద్దరూ ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వీడియోలు కూడా తీశారు.

సోషల్ మీడియాలో ఆకట్టుకునేలా ప్రొఫైల్ క్రియేట్ చేసిన యువకుడు.. ప్రేమలో పడిన యువతి.. చివరకు ప్రియుడి కోరిక మేరకు..


ఇంటికి వచ్చిన బాలిక.. జరిగిన దారుణం గురించి ఏడుస్తూ తల్లిదండ్రులకు తెలియజేసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అవడంతో పోలీసులు.. నేరుగా నిందితుడి ఇంటికి వెళ్లారు. బాధితురాలి తాతను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి ఫోన్‌ను పరిశీలించగా.. అందులో అత్యాచారానికి సంబంధిన వీడియోలు బయటపడ్డాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మనువరాలు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Live in relationship: సహజీవనం సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన పోలీసులకు షాక్.. రక్తం ప్యాకెట్లు బయటపడడంతో..



Updated Date - 2022-10-14T00:54:35+05:30 IST