సోషల్ మీడియాలో ఆకట్టుకునేలా ప్రొఫైల్ క్రియేట్ చేసిన యువకుడు.. ప్రేమలో పడిన యువతి.. చివరకు ప్రియుడి కోరిక మేరకు..

ABN , First Publish Date - 2022-10-13T22:49:24+05:30 IST

సోషల్ మీడియా ద్వారా ముక్కూ మొఖం, ఊరు పేరు తెలియని వారు కూడా స్నేహితులుగా మారుతుంటారు. కొన్ని పరిచయాలు చివరకు ప్రేమగా రూపాంతరం చెందుతుంటాయి. అయితే..

సోషల్ మీడియాలో ఆకట్టుకునేలా ప్రొఫైల్ క్రియేట్ చేసిన యువకుడు.. ప్రేమలో పడిన యువతి.. చివరకు ప్రియుడి కోరిక మేరకు..

సోషల్ మీడియా ద్వారా ముక్కూ మొఖం, ఊరు పేరు తెలియని వారు కూడా స్నేహితులుగా మారుతుంటారు. కొన్ని పరిచయాలు చివరకు ప్రేమగా రూపాంతరం చెందుతుంటాయి. అయితే ఈ క్రమంలో అంతే స్థాయిలో మోసాలు కూడా జరుగుతుంటాయి. సులువుగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో కొందరు యువతులు, మహిళలను వివిధ రకాలుగా ట్రాప్ చేస్తుంటారు. చివరకు దారుణంగా మోసపోతుంటారు. తాజాగా ఢిల్లీకి చెందిన యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆకట్టుకునేలా ఉన్న ప్రొఫైల్ చూసి ప్రేమలో పడింది. చివరకు ఏం జరిగిందంటే..


ఢిల్లీ చాందినీ చౌక్‌కు చెందిన 25 ఏళ్ల యువతికి కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్‌లో (Facebook) సెర్చ్ చేస్తుండగా ఓ అందమైన ప్రొఫైల్ (Beautiful profile) కనిపించింది. స్పానిష్‌కు చెందిన పెద్ద నటుడు పొటో, అతడి వివరాలు యువతిని ఆకట్టుకున్నాయి. దీంతో ఫ్రెండ్ రిక్వెస్ట్ (Friend request) రాగానే వెంటనే ఓకే చేసింది. అవతలి వ్యక్తితో రోజూ చాటింగ్ చేసేది. కొన్నాళ్లకు ఫోన్ నంబర్లు కూడా షేర్ చేసుకున్నారు. తర్వాత రోజూ చాటింగ్ (Chatting) చేసుకునేవారు. ఇలా వారి మధ్య ప్రేమ మొదలైంది. చివరకు యువతి అతడితో చాటింగ్ చేయకుండా ఒక్క నిముషం కూడా ఉండలేనంతగా మారిపోయింది. కొన్నాళ్ల తర్వాత ప్రియుడు అడగడంతో యువతి పర్సనల్ ఫొటోలను పంపించింది. చాలా ఫొటోలను సేకరించిన యువకుడు.. చివరకు ఆమెను బెదిరించడం మొదలెట్టాడు.

Govt Jobs: అదృష్టం అంటే ఇదే కదా.. ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంకో విశేషం ఏంటో తెలుసా..


తాను చెప్పిన ప్రకారం చేయకుంటే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి ఆమెను డబ్బులు డిమాండ్ చేయడం మొదలెట్టాడు. రోజురోజుకూ అతడి వేధింపులు ఎక్కువ అవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌ బాగ్‌పత్ ప్రాంతానికి చెందిన యువకుడు.. స్పానిఫ్ నటుడి ఫొటోతో  నకిలీ ఐడీని సృష్టించినట్లు గుర్తించారు.  ఇంగ్లీష్ రాకున్నా గూగుల్ ట్రాన్స్‌లేట్‌ ద్వారా ఆమెతో చాటింగ్ చేసేవాడు. చివరకు అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రెండు మొబైల్ ఫోన్లు, మెమొరీ, మూడు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Live in relationship: సహజీవనం సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన పోలీసులకు షాక్.. రక్తం ప్యాకెట్లు బయటపడడంతో..



Updated Date - 2022-10-13T22:49:24+05:30 IST