Viral Video: ఈ ఏనుగుది ఎంత మంచి మనసు.. కింద పడ్డ వస్తువును ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2022-08-19T03:01:14+05:30 IST

ఏనుగులకు (elephants) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social media) ఎన్నో వైరల్ (Viral) అవుతుంటాయి. వాటిలో కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని ఏనుగులు..

Viral Video: ఈ ఏనుగుది ఎంత మంచి మనసు.. కింద పడ్డ వస్తువును ఏం చేసిందో చూడండి..

ఏనుగులకు (elephants) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social media) ఎన్నో వైరల్ (Viral) అవుతుంటాయి. వాటిలో కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని ఏనుగులు కొన్నిసార్లు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. ప్రస్తుతం మనం చూడబోయే ఏనుగు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. తనను చూడటానికి వచ్చిన సందర్శకుల పట్ల అది చూపించిన మర్యాద.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కింద పడ్డ వస్తువులను తిరిగి వారికి అందించడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఇన్‌స్టాగ్రాంలో (Instagram) ఓ వీడియో వైరల్ అవుతోంది. చైనాలోని ఓ జూలోన (Zoo)  ఏనుగు వద్ద చాలా మంది సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తుంటారు. ఆ సమయంలో ఓ బాలుడికి చెందిన చెప్పు కింద పడిపోతుంది. దీంతో పిల్లవాడు చెప్పు కోసం ఏడుస్తుంటాడు. అయితే కిందపడ్డ వస్తువును గమనించిన ఏనుగు.. దాన్ని తొండంతో ఎంతో జాగ్రత్తగా తీసుకుని, బాలుడికి అందజేస్తుంది. దీంతో ఆ బాలుడు సంతోషంతో ఏనుగుకు గడ్డిని అందిస్తాడు. దాన్ని ఏనుగు.. ప్రేమతో తీసుకుని తింటుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

Monkey video: నాకు నచ్చింది నాకే దక్కాలన్న కోతి.. నేనూ తగ్గనన్న యువతి.. చివరకు ఏమైందంటే..





Updated Date - 2022-08-19T03:01:14+05:30 IST