Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 17 Aug 2022 20:58:24 IST

Monkey video: నాకు నచ్చింది నాకే దక్కాలన్న కోతి.. నేనూ తగ్గనన్న యువతి.. చివరకు ఏమైందంటే..

twitter-iconwatsapp-iconfb-icon
Monkey video: నాకు నచ్చింది నాకే దక్కాలన్న కోతి.. నేనూ తగ్గనన్న యువతి.. చివరకు ఏమైందంటే..

చేతిలో తినుబండారాలు ఉన్న సమయంలో.. కోతుల (Monkeys) వద్దకు వెళ్లాలంటే భయపడతాం. కొన్నిసార్లు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో గానీ.. ఉన్నట్టుండి ఇలా వచ్చి, అలా లాక్కుని వెళ్లిపోతుంటాయి. ఇక పండ్ల దుకాణదారులైతే.. నిత్యం కోతులపై ఓ కన్నేసి ఉంచుతుంటారు. అయినా ఏదో ఒక సందర్భంలో తమకు కావాల్సిన ఆహారాన్ని ఎలాగోలా దక్కించుకుంటుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కోతి.. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ కోతికి తినుబండారాలకంటే గ్లామర్‌కు సంబంధించిన వస్తువులంటేనే ఇష్టమున్నట్టుంది. సన్ గ్లాసెస్ (Sunglasses) కోసం ఓ యువతితో దాదాపు యుద్ధమే చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇన్‌స్టాగ్రాంలో (Instagram) ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఆంజనేయుడి గుడికి (Anjaneya temple) వెళ్లిన ఓ యువతికి.. కోతి షాక్ ఇచ్చింది. ఆంజనేయుడి విగ్రహం వద్ద పూజలు చేసిన యువతి కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటుంది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కోతి.. యువతి చేతిలో ఉన్న సన్ గ్లాసెస్‍‌పై కన్నేస్తుంది. ఎలాగైనా వాటిని దక్కించుకోవాలని ప్లాన్ వేస్తుంది. కొద్దిసేపు చూసి, తర్వాత నేరుగా యువతి వద్దకు వచ్చి, చేతిలోని గ్లాసెస్‌ని బలవంతంగా లాక్కుంటుంది. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్ అవుతుంది. తర్వాత ఆమె కూడా తగ్గకుండా.. ఎలాగైనా తన గ్లాసెస్‌ను తీసుకోవాలని ట్రై చేస్తుంది. దీంతో కోతి కోపంగా చూస్తూ భయపెడుతుంది. అయినా యువతి మాత్రం ఏమాత్రం భయపడకుండా.. కోతి చేతిలోని గ్లాసెస్‌ని కింద పడేస్తుంది. తర్వాత వాటిని చాకచక్యంగా తీసుకుని.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

snake moves with legs: కాళ్లతో నడుస్తున్న పాము.. విచిత్రంగా ఉంది కదా.. చూస్తే వావ్! అనాల్సిందే..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

భర్త తాంత్రికుడు కావడంతో తలుపులు వేసి.. పూజలు చేస్తున్నాడేమో అనుకుంది.. అయితే ఉన్నట్టుండి యువతి గొంతు వినిపించడంతో..ఇన్నాళ్లూ.. తమ కూతురు కాలుజారి కాలువలో పడిందనుకున్నారు.. కానీ ఇంట్లో పరుపు శుభ్రం చేస్తుండగా.. బయటపడిన పేపర్‌తో..ఇంట్లోనే శవాన్ని పూడ్చేశాడు.. ఫోన్‌ను కంటైనర్‌పై పడేశాడు.. అన్నీ దృశ్యం సినిమాలో చూపించినట్టే చేశాడు కానీ..Viral Video: పామును పరుగెత్తించిన ఉడుత.. చూస్తే షాకవడం మాత్రం ఖాయం..videoWedding funny video: కాబోయే భార్య కోసం సాహసం చేసిన వరుడు.. వీడియో చూసి శభాష్ అంటున్న నెటిజన్లు.. videohusband ఇంట్లో లేడని తెలుసుకుని లోపలికి వెళ్లిన యువకుడు.. చివరకు అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం రావడంతో..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.