Viral photo: చెట్లే తన ఆవాసం.. రాత్రిళ్లు రంగు రంగు బొమ్మలతో సావాసం.. అంతా కూతురి కోసమే అంటున్న తండ్రి..

ABN , First Publish Date - 2022-08-18T03:13:56+05:30 IST

కూతురు పుట్టిందంటే ఛీదరించుకునే నేటి కాలంలో కూతుళ్ల సంక్షేమమే ధ్యేయంగా బతికే తండ్రులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అలాంటి వారిలో.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే..

Viral photo: చెట్లే తన ఆవాసం.. రాత్రిళ్లు రంగు రంగు బొమ్మలతో సావాసం.. అంతా కూతురి కోసమే అంటున్న తండ్రి..

కూతురు పుట్టిందంటే ఛీదరించుకునే నేటి కాలంలో కూతుళ్ల సంక్షేమమే ధ్యేయంగా బతికే తండ్రులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అలాంటి వారిలో.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ముందు వరుసలో ఉంటాడు. తల్లి లేని లోటును తీర్చడమే కాకుండా.. కూతురు బంగారు భవిష్యత్ కోసం అతడు పడుతున్న కష్టం.. అందరి హృదయాలను కదిలిస్తోంది. పగటి పూజ చెట్ల కింద నిద్రపోవడం, రాత్రిళ్లు వీధుల్లో రంగు రంగుల బెలూన్లను అమ్ముతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సెంట్రల్ చైనాలోని (China) హెనాన్ ప్రావిన్స్‌లోని జుచాంగ్‌కు చెందిన తండ్రీకూతుళ్ల (Father and daughter) ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వాంగ్ అనే వ్యక్తి.. తన కూతురు చదువు కోసం నిద్రాహారాలు మాని కష్టపడుతున్నాడు. భార్య చనిపోవడంతో కూతురు ఆలనాపాలనా తనే చూసుకుంటున్నాడు. వారికి బంధువులెవరూ లేకపోవడంతో కూతురుకి.. తల్లీ, తండ్రీ, స్నేహితుడు.. ఇలా అన్నీ తానై పెంచుతున్నాడు. ఇతడు గతంలో కంట్రక్షన్ రంగంలో పని చేసేవాడు. ఈ క్రమంలో అతను చాలా జీతం నష్టపోయాడు. చివరకు ఇతడికి ఇల్లు కూడా లేకుండా పోయింది. చివరకు పిల్లలను ఆడించే రంగు రంగుల బెలూన్లు, బొమ్మలను అమ్మాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే ప్రతి రూపాయినీ, అనవసర ఖర్చు చేయకుండా.. కూతురి సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాడు.

Monkey video: నాకు నచ్చింది నాకే దక్కాలన్న కోతి.. నేనూ తగ్గనన్న యువతి.. చివరకు ఏమైందంటే..


పగటి వేళల్లో చెట్ల కింద సేదతీరడం, రాత్రిళ్లు బెలూన్లను విక్రయించడం మొదలెట్టాడు. ఇటీవల అతడి కూతురుకు వేసవి సెలవులు రావడంతో తనతో పాటూ రాత్రిళ్లు బెలూన్లు అమ్మేందుకు తీసుకెళ్లాడు. రాత్రి వేళ రోడ్డుపై తండ్రితో పాటూ వెళ్తున్న చిన్నారి ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ప్రస్తుతం వీరి కన్నీటిగాధ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం ఇతన్ని అంతా  'బెలూన్ ఫాదర్' అని పిలుస్తుంటారు. తన కూతురును బాగా చదివించేందుకు ఇప్పటి నుంచే డబ్బులు సేకరిస్తున్నట్లు వాంగ్ చెబతున్నాడు. ఇతడి గురించి తెలుసుకున్న నెటిజన్లు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

snake moves with legs: కాళ్లతో నడుస్తున్న పాము.. విచిత్రంగా ఉంది కదా.. చూస్తే వావ్! అనాల్సిందే..



Updated Date - 2022-08-18T03:13:56+05:30 IST