ఏడాది క్రితం చనిపోయిన 82 ఏళ్ల బామ్మ మళ్లీ పుట్టింది.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-06-11T21:39:18+05:30 IST

ఆ యువకుడి అమ్మమ్మ గతేడాది మే నెలలో 82 ఏళ్ల వయసులో మరణించింది..

ఏడాది క్రితం చనిపోయిన 82 ఏళ్ల బామ్మ మళ్లీ పుట్టింది.. కారణమేంటంటే..

ఆ యువకుడి అమ్మమ్మ గతేడాది మే నెలలో 82 ఏళ్ల వయసులో మరణించింది.. ఆమె మరణ ధృవీకరణ పత్రం కోసం ఆ యువకుడు పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగాడు.. నెలలు గడుస్తున్నా అక్కడి సిబ్బంది డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.. దీంతో ఆ యువకుడు పబ్లిక్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు.. చివరకు నెల రోజుల తర్వాత అతనికి పోస్ట్ ద్వారా ఓ కవర్ వచ్చింది.. తీరా చూస్తే అందులో తన బామ్మ డెత్ సర్టిఫికెట్‌కు బదులు బర్త్ సర్టిఫికెట్ ఉంది.. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

ఆ మహిళ చనిపోయిన 18 ఏళ్ల తర్వాత Supreme Court సంచలన తీర్పు.. రూ.25 లక్షల జరిమానా చెల్లించాలంటూ..


నర్సింగ్‌పూర్‌కు చెందిన శ్యామ్ బాయి 82 సంవత్సరాల వయసులో గతేడాది మే1న మరణించింది. ఆమె మరణించిన వారం తర్వాత, మనవడు శైలేష్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు, డిజిటల్ అసిస్టెంట్‌కు సమాచారం అందించాడు. తన అమ్మమ్మ మరణ ధృవీకరణ పత్రం కోసం అభ్యర్థించాడు. అయితే నెలలు గడుస్తున్నా మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. స్నేహితుల సలహా మేరకు శైలేష్ పబ్లిక్ సర్వీస్ సెంటర్‌లో తన అమ్మమ్మ డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 


నెల రోజుల తర్వాత లేఖ అందుకున్న శైలేష్ దానిని చూసి షాకయ్యాడు. ఎందుకంటే డెత్ సర్టిఫికెట్ స్థానంలో బర్త్ సర్టిఫికెట్ ఉంది. వెంటనే ఆ విషయాన్ని సంబంధిత అధికారులకు చెప్పాడు. ఇది విని అక్కడ ఉన్న ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అధికారులు వెంటనే తమ తప్పును సరిదిద్దుకుని మరణ ధ్రువీకరణ పత్రాన్ని సిద్ధం చేసి శైలేష్‌కు అప్పగించారు.

Updated Date - 2022-06-11T21:39:18+05:30 IST