ఆ మహిళ చనిపోయిన 18 ఏళ్ల తర్వాత Supreme Court సంచలన తీర్పు.. రూ.25 లక్షల జరిమానా చెల్లించాలంటూ..

ABN , First Publish Date - 2022-06-11T20:50:13+05:30 IST

18 ఏళ్ల క్రితం చనిపోయిన ఆ మహిళ భర్త చేస్తున్న న్యాయపోరాటానికి ఫలితం దక్కింది.

ఆ మహిళ చనిపోయిన 18 ఏళ్ల తర్వాత Supreme Court సంచలన తీర్పు.. రూ.25 లక్షల జరిమానా చెల్లించాలంటూ..

18 ఏళ్ల క్రితం చనిపోయిన ఆ మహిళ భర్త చేస్తున్న న్యాయపోరాటానికి ఫలితం దక్కింది. సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ మహిళ మరణానికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని భావించిన సుప్రీం కోర్టు.. అతనికి రూ.25 లక్షలు జరిమానాగా విధించింది. పాటియాలాలోని సేవక్ కాలనీకి చెందిన హర్నెక్ సింగ్ భార్య మంజిత్ కౌర్ (47)కి తరచుగా కడుపు నొప్పి వస్తుండడంతో 13 జూలై 2004న డాక్టర్ గుర్మీత్ సింగ్‌ను కలిశారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్.. మంజిత్ పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్టు నిర్ధారించి ఆపరేషన్ చేయాలని చెప్పాడు. 


ఇది కూడా చదవండి..

ATM లో రూ.1.91 లక్షలు డిపాజిట్ చేస్తున్న యువకుడు.. సడన్‌గా ముగ్గురు కుర్రాళ్ల ఎంట్రీ.. చివరకు షాకింగ్ సీన్..!



వైద్యుడి సలహా మేరకు 28 జూలై 2004న ఆపరేషన్‌కు మంజిత్ కౌర్ సిద్ధమయ్యారు. అదే రోజు డాక్టర్ గుర్మీత్ సింగ్ ఆమెకు లాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు. అయితే తర్వాతి రోజు మంజిత్‌కు కడుపు నొప్పి మరింత ఎక్కువైంది. ఆ విషయాన్ని గుర్మీత్‌కు తెలియజేయగా.. అది సాధారణమేనని చెప్పి అతను పట్టించుకోలేదు. ఆ తర్వాతి రోజుకు మంజిత్ పరిస్థితి విషమంగా మారింది. మరో హాస్పిటల్‌కు మారుద్దామంటే డాక్టర్ గుర్మీత్ సింగ్ అంగీకరించలేదు. అదే రోజు సాయంత్రం గుర్మీత్ స్పందిస్తూ.. ఆమె కడుపునొప్పికి తను చేసిన సర్జరీ కారణం కాదని, ఆమె పాంక్రియాటిస్‌లో సమస్య ఉందని చెప్పారు. 


జూలై 30, 2004న రాత్రి 9 గంటలకు డాక్టర్ గుర్మీత్.. మంజిత్‌ను డీఎమ్‌సీహెచ్ హాస్పిటల్‌లో ఉన్న డాక్టర్ అతుల్ మిశ్రాకు రిఫర్ చేశారు. అయితే రోగి రికార్డులు, ఆపరేషన్ నోట్స్ ఇవ్వడానికి నిరాకరించారు. మంజిత్‌ను పరీక్షించిన వైద్యులు లాప్రోస్కోపిక్ సర్జరీలోనే తేడా ఉందని తేల్చారు. ఆ సర్జరీ వల్ల మంజిత్ చిన్న పేగుకు గాయమైనట్టు గమనించారు. చివరకు 11 ఆగస్టు 2004న మంజిత్ మరణించారు. ఆమె మరణానికి డాక్టర్ గుర్మీత్ సింగ్ నిర్లక్ష్యమే కారణమని మంజిత్ భర్త హర్నెక్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. చివరకు మంజిత్ మరణించిన 18 ఏళ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. 

Updated Date - 2022-06-11T20:50:13+05:30 IST