Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 24 Jun 2022 20:41:59 IST

40 ఏళ్ల వయసులో ఇదేం పోయేకాలం.. 14 ఏళ్ల బాలిక తండ్రికి రూ.30 వేలు ఇచ్చిమరీ..

twitter-iconwatsapp-iconfb-icon
40 ఏళ్ల వయసులో ఇదేం పోయేకాలం.. 14 ఏళ్ల బాలిక తండ్రికి రూ.30 వేలు ఇచ్చిమరీ..

కొందరి ప్రవర్తన చూస్తే.. ఈ వయసులో వీడికి ఇదేం పోయే కాలం.. అని అనిపిస్తుంది. వయసు, వరసలు మరచి ప్రవర్తించే ప్రబుద్ధులు.. తరచూ ఎక్కడో చోట తారసపడుతూనే ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఇలాంటి ప్రబుద్ధుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. 40ఏళ్ల వయసున్న అతను.. 14 బాలికపై కన్నేశాడు. బాలిక తండ్రికి రూ.30వేలు ఇచ్చి మరీ.. సభ్యసమాజం తల దించుకునే పని చేశాడు. వివరాల్లోకి వెళితే..

బీహార్ రాష్ట్రం కోసి, సీమాంచల్ తదితర ప్రాంతాల్లో పేదరికం.. ఆడపిల్లలకు శాపంగా మారింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇక్కడి వారికి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం భారంగా మారింది. దీన్ని అవకాశం తీసుకున్న మధ్యవర్తులు.. డబ్బులు తీసుకుని ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పెళ్లి సంబంధాలు కుదుర్చుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ పరిధికి చెందిన జ్వాలా సింగ్ (40) అనే వ్యక్తి.. జులేఖా ఖాతూన్ అనే మధ్యవర్తిని సంప్రందించాడు. అతడి సహకారంతో 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఇందుకోసం బాలిక తల్లిదండ్రులకు రూ.30,000 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. పేదరికం కారణంగా బాలిక తల్లిదండ్రులు కూడా ఇందుకు ఒప్పుకొన్నారు.

తల్లి ఫోన్లో వీడియోను చూసి తానూ అలా చేయాలనుకున్నాడు.. పదేళ్ల పిల్లాడి మృతి కేసులో షాకింగ్ నిజాలు..!

ఎవరికీ తెలీకుండా రహస్యంగా పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. బాలికను తన మేనమామ ఇంటికి తీసుకెళ్లి, అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. గ్రామ పెద్దకు విషయం తెలియజేశారు. అంతా కలిసి చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు, పోలీసులు పెళ్లిని నిలిపేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన బాలికలు, యువతులను.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ వయస్సుల వారికి ఇలాగే కట్టబెట్టినట్లు విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

AIDS ఉన్న విషయం దాచి ఓ యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటంటే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

సద్గురు జగ్గీ వాసుదేవ్ నోట.. గంగవ్వ మాట.. మట్టి ప్రాముఖ్యత తెలియజేస్తూ... ఆయన ఏమన్నారంటే..videoకాటికి కాళ్లు చాపే వయసులో జిమ్మాస్టర్‌గా ఘనత.. త్వరలో "మిస్టర్ ఆసియా" పోటీల్లో పాల్గొంటున్న ఆ 72 ఏళ్ల వ్యక్తి ఎవరో తెలుసా..ఆలయం వద్ద నదీ స్నానం చేస్తూ.. దంపతుల రాసలీలలు.. విసిగిపోయిన భక్తులంతా కలిసి చివరకు.. videoపెళ్లయి రెండేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపం.. భార్య నిద్రపోయాక భర్త బలవన్మరణం..!ప్రేమలో పడిన వారికి కుక్క కంటే హీనమైన చావు తప్పదంటూ వాట్సప్ స్టేటస్‌లు పెట్టి మరీ 27 ఏళ్ల యువతి దారుణమిది..!గాజులు కొనుక్కుంటానంటే పెళ్లయిన ఏడో రోజే మార్కెట్‌కు తీసుకెళ్లిన భర్త.. నడిరోడ్డుపై ఊహించని షాకిచ్చిన భార్య..!
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.