AIDS ఉన్న విషయం దాచి ఓ యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-24T23:18:24+05:30 IST

డబ్బు కోసం కొందరు ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధంగా ఉంటారు. మరికొందరు మహిళలను మోసం చేయడమే పనిగా పెట్టుకుని మాయమాటలు చెప్పి... చివరికి వారి జీవితాలను నాశనం చేస్తుంటారు. ఇప్పుడు మనం...

AIDS ఉన్న విషయం దాచి ఓ యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటంటే..

డబ్బు కోసం కొందరు ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధంగా ఉంటారు. మరికొందరు మహిళలను మోసం చేయడమే పనిగా పెట్టుకుని మాయమాటలు చెప్పి... చివరికి వారి జీవితాలను నాశనం చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఆడిన ఒకే ఒక్క అబద్ధంతో అతడి భార్య, కుమారుడి జీవితమే ప్రశ్నార్థకంగా మారింది.  AIDS ఉన్న విషయం దాచి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత ప్రస్తుతం ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉందంటే..


ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా పరిధికి చెందిన ఓ వ్యక్తి.. రెండేళ్ల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల వారికి ఓ బిడ్డ కూడా పుట్టాడు. మొన్నటిదాకా వారి కుటంబంలో ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల ఆ వ్యక్తి భార్యకు అనారోగ్యంగా ఉంటే వైద్యులను సంప్రదించింది. రక్త పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమెకు AIDS పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్ అయింది. అలాగే ఆమె బిడ్డకు కూడా AIDS సోకినట్లు తేలింది. ఎందుకిలా జరిగిందో ఆమెకు మొదట అర్థం కాలేదు. అయితే కొన్నాళ్లకు భర్తకు AIDS ఉందనే విషయం తెలిసింది. పెళ్లికి ముందే ఎయిడ్స్ ఉన్నా.. ఆ విషయం దాచి, కట్నం కోసం వివాహం చేసుకున్నట్లు తేలింది. 

కాటికి కాళ్లు చాపే వయసులో జిమ్మాస్టర్‌గా ఘనత.. త్వరలో "మిస్టర్ ఆసియా" పోటీల్లో పాల్గొంటున్న ఆ 72 ఏళ్ల వ్యక్తి ఎవరో తెలుసా..


మోసపోయానని తెలుసుకున్న ఆమె.. బిడ్డతో సహా నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదిలావుండగా, ఆమె భర్త ప్రస్తుతం చివరి దశలో ఉన్నాడు. మరోవైపు అతడి భార్య, బిడ్డ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన వారంతా.. ‘‘అయ్యో పాపం! ఒకరి తప్పు కారణంగా రెండు జీవితాలు నాశనం అయ్యాయే’’.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆలయం వద్ద నదీ స్నానం చేస్తూ.. దంపతుల రాసలీలలు.. విసిగిపోయిన భక్తులంతా కలిసి చివరకు..

Updated Date - 2022-06-24T23:18:24+05:30 IST