ఆయన కోసం ఏమైనా చేస్తా.. 55 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడ్డ 18 ఏళ్ల యువతి చెబుతున్న మాటలివీ.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-08-28T21:08:27+05:30 IST

ఆ యువతి వయసు 18 ఏళ్లు.. మంచి గాయని.. ఆమె పాటలు విని స్థానికంగా నివిసించే ఫరూక్ అనే 55 ఏళ్ల బ్రహ్మచారి పరవశించిపోయేవాడు

ఆయన కోసం ఏమైనా చేస్తా.. 55 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడ్డ 18 ఏళ్ల యువతి చెబుతున్న మాటలివీ.. అసలు కథేంటంటే..

ఆ యువతి వయసు 18 ఏళ్లు.. మంచి గాయని.. ఆమె పాటలు విని స్థానికంగా నివిసించే ఫరూక్ అనే 55 ఏళ్ల బ్రహ్మచారి పరవశించిపోయేవాడు.. ఆమెకు అభిమానిగా మారిపోయాడు.. తరచుగా ఆమె ఇంటికి వెళ్లి ఆమె పాటలు వినేవాడు.. ఆమె గానం గురించి, పాటల గురించి గంటల కొద్దీ చర్చించేవాడు.. ఈ క్రమంలో ఆ యువతి అతని పట్ల అనురాగం పెంచుకుంది.. క్రమంగా ఇద్దరూ దగ్గరయ్యారు.. చివరకు ప్రేమలో పడ్డారు.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.. పాకిస్థాన్‌ (pakistan)కు చెందిన 18 ఏళ్ల ముస్కాన్, 55 ఏళ్ల ఫరూక్‌ ప్రేమ కథ ఇది. 


ఇది కూడా చదవండి..

Stone-Pelting Festival: మధ్యప్రదేశ్‌లో జరిగే గోత్మార్ జాతర ఆచారం గురించి వింటే షాక్.. ప్రాణాలతో చెలగాటమే..


ఓ యూట్యూబటర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు తమ ప్రేమ కథను వెల్లడించారు. `నేను ముస్కాన్ ఇంటికి దగ్గర్లోనే ఉండేవాడని. ఆమె గానం నాకు చాలా ఇష్టం. ఆమె పాటలు వినేందుకు నేను తరచుగా ముస్కాన్ ఇంటికి వెళ్లేవాడిని. ఆమెతో పాటల గురించి గంటల కొద్దీ చర్చించేవాడిని. ఆ క్రమంలో మేం దగ్గరయ్యాం. నిజం చెప్పాలంటే మొదట ముస్కాన్ నాకు ప్రపోజ్ చేసింది. నేను షాకయ్యా. తర్వాత నేను కూడా అంగీకరించా. అది నా అదృష్టంగా భావించా. నేను 55 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ముస్కాన్ కారణమేమోన`ని ఫరూక్ అన్నాడు. 


`ఫరూక్ మాట్లాడే విధానం, శైలి, అతను నాపై చూపే అభిమానం, అతని కల్మషం లేని మనసు నాకెంతో నచ్చాయి. మేం రిలేషన్‌షిప్‌లోకి రావాలని అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు నాకు చాలా చెప్పారు. అయినా ఎవరినీ పట్టించుకోలేదు. ఫరూక్ కోసం నేను ఏమైనా చేయగలను. అతని కోసం ప్రాణాన్ని కూడా ఇవ్వగలన`ని ముస్కాన్ చెప్పింది.

Updated Date - 2022-08-28T21:08:27+05:30 IST