Home » YS Sunitha Reddy
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి అడిగే ప్రశ్నలకు సీఎం జగన్(CM Jagan) ఎందుకు సమాధానం చెప్పడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి (TulasiReddy) ప్రశ్నించారు.
వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Case) అప్రూవర్ దస్తగిరి (Dastagiri) చేసిన ఆరోపణలపై దేవిరెడ్డి శంకర్ రెడ్డి (Devireddy Shankar Reddy) కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి (Chaitanya Reddy) తాజాగా స్పందించారు. తాను కడప సెంట్రల్ జైలుకు (Kadapa Central Jail) మెడికల్ క్యాంపు కోసం వెళ్లానని, జైల్లో ఉండే వారి ఆరోగ్య పరీక్షల నిమిత్తమే అక్కడికి వెళ్లానని తెలిపారు. తాను నిజంగానే దస్తగిరిని జైల్లో బెదిరించి ఉంటే.. అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.
Andhrapradesh: మాజీ మంత్రి వివేక హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రపైన విచారణ జరిపించాలని టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం తన తండ్రిని హత్య చేయించారని వైఎస్ సునీతారెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. రాష్ట్రంలో హంతకులకు ప్రజలకు మధ్య పోరాటం ఇదన్నారు.
Andhrapradesh: మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్ హత్య కేసులో ప్రమేయం ఉన్నందునే దర్యాప్తుకు ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యకు జరిగిన కుట్రలో కచ్చితంగా జగన్ పాత్ర ఉందని సంచలన కామెంట్స్ చేశారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై బీజేపీ నేత సత్యకుమార్ మరోసారి విరుచుకుపడ్డారు. మాట్లాడితే చాలు నా అక్కచెల్లెమ్మలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్.. సొంత బాబాయి కుటుంబానికే న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. అధికారం చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో తేల్చక పోగా వ్యవస్థలోఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని దర్యాప్తు సంస్థల విచారణను కూడా అడ్డుకుని నిందితులను కాపాడుతున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు జగన్‌కి, అయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని కోరారు. తన అనుకునే వాళ్లకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని సునీత తేల్చి చెప్పారు.
YS Sunitha Reddy: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసు వ్యవహారం ఇప్పటికీ తేలలేదు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించాల్సిందేనని వివేకా కుమార్తె సునీతా రెడ్డి (Sunitha Reddy) న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) బాబాయి హత్య ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది...
వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఇవాళ మీడియా ముందుకు రానున్నారు. 11 గంటలకి ఢిల్లీ కాన్స్ట్యూషన్ క్లబ్ లో సునీతారెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వివేకానంద రెడ్డి హత్యకు కుట్ర దారులు ఎవరో మీడియాకు సునీతారెనడ్డి వెల్లడించనున్నారు. మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయి హత్య ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది.
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు గురువారం కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిశారు. వివేకా హత్య కేసులో తమకు ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు..తమపై పెట్టిన కేసుల వివరాలపై ఎస్పీతో సునీత, రాజశేఖర్ రెడ్డి చర్చించారు.
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి సోషల్ మీడియా పోస్టుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.