Home » YCP
ఏపీ శాసనమండలిలో మరోసారి వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ప్లకార్డులతో ఆ పార్టీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు.
ప్రజా సమస్యల కోసమే ఎమ్మెల్యేలు ఎన్నికవుతారని.. అలాంటిది అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవడం సబబు కాదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీలో జగన్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని తెలిపారు.
చైర్మన్‌ను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఏపీ శాసనమండలి గురువారానికి వాయిదా పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.
ఏపీ శాసనమండలి వచ్చే బుధవారానికి (మార్చి 4) వాయిదా పడింది. ఈరోజు ఉదయం ఒకసారి సభ వాయిదా పడగా.. తిరిగి మొదలైనప్పటికీ పది సెకన్లకే ఛైర్మన్ సభను వాయిదా వేశారు.
శ్రీకాకుళం కార్పొరేషన్‌లో డయేరియా అదుపులోకి వచ్చిందని.. ప్రస్తుతం 102 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైసీపీ డయేరియా విషయంలోనూ శవ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పథకం నిలిపివేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. రాయలసీమ అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు సంబంధించి సుదీర్ఘ ప్రసంగం చేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిపై ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇలాంటి సుదీర్ఘ ప్రసంగాలు వద్దన్నారు.
వైసీపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన కూటమి పార్టీల నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.