Flash: వైసీపీ ఎంపీ మిథున్ అరెస్టుకు రంగం సిద్ధం!
ABN , Publish Date - Jul 19 , 2025 | 09:59 AM
Mithun Reddy Arrest: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నారు. విచారణ అనంతరం ఆయన్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.
అమరావతి, జులై 19: లిక్కర్ స్కామ్ కేసులో (Liquor Scam Case) విచారణను సిట్ (SIT) వేగవంతం చేసింది. ఈ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈరోజు సిట్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. విచారణకు తాను హాజరవుతున్నట్లు మిథున్ రెడ్డి అధికారులతో మాట్లాడినట్లు సమాచారం.
కాగా మిథున్ రెడ్డి (Mithun Reddy) ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు రావాలని సిట్ అధికారులు మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే.. విచారణ అనంతరం సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.
సిట్ కార్యాలయం ఎదుట భారీ భద్రత..!
సిట్ కార్యాలయం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు వచ్చే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా ఇప్పటికే ఈ కేసులో 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈ స్కామ్‌లో పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా మిథున్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అవుతారా? లేదా? అనే ఉత్కంఠ వైసీపీ పార్టీ నేతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..