Home » Viveka Murder Case
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో(YS Viveka Mur) కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి (MP YS Avinash Reddy) సీబీఐ కోర్టు (CBI Court) సమన్లు జారీచేసింది..
వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను టెక్నికల్ తప్పిదాల కారణంగా సీబీఐ కోర్టు వెనక్కి పంపించింది. దీంతో సీబీఐ మళ్లీ ఛార్జ్ షీట్‌ను రీసబ్మిట్ చేసింది.
వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన అర్హతపై స్పష్టత ఇవ్వాలని ఏ9 ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కేసును పూర్తిగా విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను హైకోర్టుకే వదిలేసింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేసేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా తనను గుర్తించాలని హైకోర్టులో ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ వరుసగా సీబీఐ (CBI) విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డిని (MP Avinash Reddy) జూన్-03 తారీఖున సీబీఐ అరెస్ట్ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..
వైఎస్ వివేకా హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలని ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ 5వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ కేసును హైకోర్టు కే పంపుతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున ముందు అక్కడ తేల్చుకోవాలని సుప్రీం వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించాడు. .
వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వైఎస్ వివేకా హత్య కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను సీబీఐ అధికారులు దాఖలు చేశారు. నాంపల్లి సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. జులై 14 వరకూ సీబీఐ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. నిందితులను చంచల్ గూడ జైల్‌కు పోలీసులు తరలించునున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాశ్‌తో పాటు సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆదివారం కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు కూడా విచారణకు రావాలంటూ నిన్ననే సీబీఐ అధికారులు నోటీసు ఇచ్చారు.
రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం పదవీ కాలాన్ని పొడిగించడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అందుకు కారణం లేకపోలేదు.