Home » Visakhapatnam
విశాఖలో కలకలం సృష్టించిన యువతి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశాలోని రాయగడలో సూట్‌కేసులో లభ్యమైన యువతి మృతదేహం విశాఖకు చెందిన సంధ్యదిగా పోలీసులు గుర్తించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై జగన్‌ది ఆది నుంచీ అడ్డుపుల్ల వేసే ధోరణే! అసలు కొత్త ఎయిర్‌పోర్టు అవసరమా? ‘విశాఖలో ఒకటి ఉందికదా! ఎర్రబస్సు రాని ఊర్లో ఎయిర్‌పోర్టు కడతారా?’... అంటూ ఎద్దేవా చేశారు. కోర్టుకు పోతాం, కేసులు వేస్తాం! అని బహిరంగ సభల్లో ప్రకటించారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ‘రెక్కలు’ విచ్చుకొనే సమయం ఆసన్నమైంది. ఈ నూతన ఎయిర్‌పోర్టు ద్వారా ప్రపంచ దేశాలతో అనుసంధానం పెరగనుంది.
ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విమానాశ్రయం రావడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారమని.. అంతర్జాతీయ విమానాశ్రయం వలన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తాయని అన్నారు.
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక గెజిట్ విడుదల చేసింది.
వైసీపీ నేతలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. డీఎస్సీపై మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాల్‌ను వైసీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే స్వీకరించాలన్నారు. డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలని జగన్, వైసీపీకి ఛాలెంజ్ చేశారు.
గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, విశాఖలో వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖను దేశంలో నంబర్-1 నగరంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.
రవాణా రంగంలో ‘PM e- Bus Sewa’ తో నూతన శకం మొదలైంది. విశాఖలోని సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.
యువత భవిష్యత్ పరమావధిగా ప్రధాని మోదీ పని చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యలో అనేక సంస్కరణలను ప్రధాని తీసుకువచ్చారని తెలిపారు.
విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి సరుకును అన్‌లోడ్ చేస్తున్న కళాసిలను రెడీమిక్స్ కాంక్రీట్ (RMC) లారీ ఢీకొట్టింది.